దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించిస్తోంది. ప్రతి రోజు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 1,26,789 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 685 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. నిన్న 59,258 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574 కు చేరింది. ఇప్పటి వరకు కరోనాకారణంగా మృతిచెందిన వారి సంఖ్య 1,66,862 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,18,51,393 మంది కోలుకున్నారు. 9,10,319 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 9,01,98,673 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్రం తెలిపింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచన 24 గంటల్లో 2,055 కొత్త కేసులు నమోదు కాగా, 7 మృతిచెందారు. అదే సమయంలో కరోనా నుంచి 303 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,362 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8,263 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 398 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,704కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,03,601 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,741గా ఉంది.