కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి వయసుతో సంబంధం లేదని ఓ 120 ఏళ్ల బామ్మ నిరూపించింది. జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా దుదు పంచాయత్‌కు చెందిన ధోలి దేవి అనే 120 ఏళ్ల బామ్మ శుక్రవారం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. దీంతో ఒకేరోజు కోటి మంది వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఆమె కూడా భాగమయ్యారు.
కాగా 120 ఏళ్ల బామ్మ తన ఇంట్లో వ్యాక్సిన్ తీసుకున్న వీడియోను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా శుక్రవారం ఒకేరోజు 1,00,63,931 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇప్పటివరకు దేశంలో ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు మొత్తం 62,09,43,580 డోసులను పంపిణీ చేశారు.
ఈ వార్త కూడా చదవండి: భార్య జననేంద్రియాలను కుట్టేసిన శాడిస్ట్ భర్త