Monday, November 25, 2024

Thunder Storm – జార్ఖండ్‌లో పిడుగుపాటు – 12 మంది దుర్మ‌ర‌ణం..

జార్ఖండ్‌లో గత రెండు రోజుల్లో పిడుగుపాటుకు 12 మంది దుర్మ‌ర‌ణం చెందారు..జార్ఖండ్‌లో గ‌త రెండు రోజులుగా బలమైన ఈదురుగాలులు, మెరుపులతో వ‌ర్షాలు కురుస్తున్నాయి… దీంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. . ధన్‌బాద్‌, జంషెడ్‌పూర్‌, గుమ్లాతో పాటు చత్రా, హజారీబాగ్, రాంచీ, బొకారో ఖుంటి తదితర ప్రాంతాల్లో పిడుగులు ప‌డ్డాయి..ఆయా ప్రాంతాల‌లో పిడుగుల‌తో 12 మంది మ‌ర‌ణించార‌ని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ విభాగం తెలిపింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. జంషెడ్‌పూర్‌లో 79 మిల్లీమీటర్ల ,బొకారోలో 52 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఉత్తర బీహార్, ఉత్తర ఒడిశా నుంచి హర్యానా నుంచి సిక్కిం వరకు అల్పపీడన ద్రోణి కారణంగా జార్ఖండ్‌లో పిడుగుల వాన కురిసిందని రాంచీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వ‌ర్షాలు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండకూడదని, ఇంట్లో తలదాచుకోవాలని సూచించారు. పిడుగులు పడే సందర్భంలో స్తంభాలు, వంతెనలు, చెరువులు, రిజర్వాయర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ వైపు వెళ్లకూడదని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement