Wednesday, December 18, 2024

Georgia | హోటల్ బెడ్‌రూమ్‌లో విగతజీవులుగా 12 మంది భారతీయులు

జార్జియాలోని గూడౌరి మౌంటైన్ రిసార్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రెస్టారెంట్‌లో కార్బన్ మోనాక్సైడ్ విడుదలై 12 మంది చనిపోయారు. చనిపోయిన 12 మందిలో 11 మంది భారతీయులేనని టిబిలిసిలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

ప్రాథమిక పరీక్షలో చనిపోయినవారి శరీరాలపై గాయాలు ఏం లేవని జార్జియా దేశీయాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. మృతులంతా అదే ఇండియన్ రెస్టారెంట్ ఉద్యోగులుగా గుర్తించారు.

బెడ్‌రూమ్‌ల దగ్గర ఉన్న పవర్ జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లీక్ అవ్వడం వల్లే వారంతా చనిపోయారని ప్రాథమిక నివేదికల్లో తెలిసింది. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు ఫోరెన్సిక్ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement