Wednesday, November 20, 2024

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1184 డెంగ్యూ కేసులు : డీహెచ్ శ్రీనివాస్

తెలంగాణలో డెంగ్యూ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… జనవరి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 1184 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. హైదరాబాద్ లోనే 516 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అలాగే ఈనెలలో 2752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయన్నారు. సీజన్ వ్యాధులు ప్రబలడానికి కారణం పానిపూరీనే ప్రధాన కారణమన్నారు. మంచినీళ్లు రంగు మారితే కలుషితమైనట్లు గుర్తించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement