Monday, November 25, 2024

Grandmother: 112 ఏళ్ల బామ్మ‌కు పెళ్లికొడుకు కావ‌లెను…

ఆ బామ్మ వయసు జస్ట్ 112 ఏళ్లు. ఆమె తన చివరి దశలో వెల్లడించిన కోరికను విన్న జనాలు ఆశ్చర్యపోతున్నారు.ఈ వ‌య‌స్సులో త‌న‌కు పెళ్లి చేసుకోవాల‌ని చెప్పి పెళ్లికి వయస్సు లేదని నిరూపించింది. అంతేకాదు ఓ అబ్బాయి ముందుకు వచ్చి ప్రపోజ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని వృద్ధురాలు కండిషన్ కూడా పెట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ పెళ్లి జరిగితే ఈ మహిళకిది ఎనిమిదో పెళ్లి అవుతుంది.

వివ‌రాల‌లోకి వెళితే…. మలేషియాలోని కెలాంతన్‌లోని తుంపట్ నగరంలో నివాసి సితి హవా హుస్సిన్ ఇప్ప‌టికే ఏడుసార్లు వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌స్సు 112 ఏళ్లు .. ఇప్పుడు ఈ వృద్ధురాలు ఎనిమిదో పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసింది.

చిన్న కొడుకు 58 ఏళ్లు
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హవా హుస్సేన్‎కి 12 మంది పిల్లలు ఉన్నారు. ఈ వృద్ధ మహిళకు వారికీ పిల్లలు ఉన్నారు. మొత్తంగా ఆమెకు 19 మంది మనవళ్లు, 30 మంది మనవరాళ్లు ఉన్నారు. ఆమె చిన్న కుమారుడు అలీ వయస్సే 58 సంవత్సరాలు.

- Advertisement -

పెళ్లి చేసుకోవాలంటే ఓ కండీషన్.
వృద్ధురాలు తన మాజీ భర్తల్లో కొందరు చనిపోయారని, మరికొందరితో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత విడిపోయారని చెప్పింది. తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. త‌న‌కు తాను ఎవ‌రికీ పెళ్లి ప్ర‌తిపాద‌న చేయ‌న‌ని పేర్కొంది.

సుదీర్ఘ జీవిత రహస్యం ఇదే..
హవా హుస్సేన్ తన సుదీర్ఘ జీవిత రహస్యాన్ని ప్రజలతో పంచుకుంది. ఆమె సాధారణ ఆహారాన్ని మాత్రమే ఇష్టపడుతుంది. మంచి ఆహారపు అలవాట్లతో పాటు, ఆమె దీర్ఘాయువు కోసం ప్రార్థన కూడా చేస్తుంది. రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తుంది. ఎక్క‌డికైన న‌డిచే వెళుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement