దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు భారీగా తగ్గుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,109 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. సుమారు 4.5 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 43 మంది కరోనా కారణగా మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 11,492కు చేరుకున్నాయి. అయితే తాజాగా నమోదైన మృతుల్లో కేరళ టాప్‌లో నిలిచింది. దేశ వ్యాప్తంగా 43 మంది మృతి చెందితే.. కేవలం కేరళలోనే 36 మంది ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదేవిధంగా దేశ వ్యాప్తంగా 1,213 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల రేటు 0.03 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 98.76 శాతానికి పెరిగింది. మొత్తం కరోనా వెలుగులోకొచ్చినప్పటి నుంచి 4.30 కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5.21 లక్షల మందికి పైగా కరోనా కారణంగా చనిపోయారు. గురువారం దేశ వ్యాప్తంగా 16.8 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 185 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement