హైదరాబాద్, ఆంధ్రప్రభ: శాతవాహనుల చరిత్రకు ఆనవాళ్లు ఉన్న సిద్దిపేటలోని రంగనాయకసాగర్ ప్రకృతి అందాలకు కొలువై పర్యాటకులను ఆకట్టుకుంటుంది. మాతంగి వాగుతీరంలో ఉన్న సిద్ధిపేట లో వేల ఏండ్లక్రితమే మానవాసాలు ఉన్న ట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని చెరువుల్లో ట్యాంక్ బండ్‌లో జిబ్రాల్టర్ రాక్ బుద్ధుడు కొలువై ఆంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అలాగే రంగనాయక సోగర్ చెరువులోని ద్వీప కల్పాన్ని అభివృద్ధి చేసి హంగులు అద్దితే పర్యాటకులను ఆకర్శించే అవకాశాలు అధికంగా ఉండటంతో ప్రభుత్వం పనులను ప్రారంభించి బడ్జెట్ లో కేటాయింపులు చేసింది.
రంగనాయకసాగర్ సిద్ధిపేటకు ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చిన్నకోడూరుమండలంలోని చంద్లపూర్ గ్రామం సమీపంలో నిర్మించిన జలాశయం. సిద్ధిపేట,రాజన్న సిరిసిల్ల జిల్లాలోని లక్షా 1,14,000ఎకరాల ఆయకట్టకునీరు అందిస్తుంది.
ఈ ప్రాజెక్టు 24 ఏప్రిల్ 2020లో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. శ్రీరాజేశ్వర జలాశయం నుంచి ఆరో దశఎత్తిపోతలతో అన్నపూర్ణ జలాశయానికి చేరుకున్న నీరు గదావరి జలాలు రంగనాయకసాగర్ పంపు హౌజ్ కు చేరుతాయి. ఈ ప్రాజెక్టు ఎఫ్ ఆర్ ఎల్ 196మీటర్లు, కట్టఎత్తు 32.4 మీటర్ల తో ప్రభుత్వం నిర్మించింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3.300 కోట్లు ఖర్చుచేసింది. కరువునేలను మురిపిస్తూ మల్లన్నసాగర్, కొండపోచమ్మ, భువనగిరి,సూర్యాపేటవరకు గోదావరినీరు చేరుకుంటుంది. సముద్ర మట్టానికి సుమారు 500 మీటర్ల ఎత్తున్న సిద్దిపేటలోని రంగనాయకసార్‌లో ద్వీపకల్పం ఉండటం ప్రకృతి ప్రసాధించిన సుందర దృశ్యం. ఒకప్రాంత అభివృద్ది ఆప్రాంత చరిత్ర, బౌగోళిక అంశాలు, సాంస్కృతిక వారసత్వం, శీతోష్ణ స్థితి పై ఆధారపడి ఉంటుంది. జీవవైవిద్యం, నదులు, జలపాతాలు ప్రాధాన్యత వహిస్తాయి.
ఆనేక ప్రాముఖ్యత అంశాలు పదిలపర్చుకున్న రంగనాయకసాగర్ రాష్ట్రంలో మరో గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు గత సంవత్సరం నిధులు సమకూర్చడంతో పాటుగా ప్రస్తుతం 2023-2024 బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. చెరువుతీరంలోని రంగనాయక టెంపుల్, రేణుకా ఎల్లమ్మ దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50లక్షలతో పనులు ప్రారంభించింది. రంగనాయకసాగర్‌ను రాష్ట్ర పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దేందుకు అనేక ప్రాధాన్యతలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి రూ. 110 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించింది. ఈ బడ్జెట్ తో ద్వీపకల్ప అభివృద్ధి, నిర్మాణ దశలో ఉన్న రహదారులు, బోర్టులు, ఫుడ్ కోర్టులు, లైటింగ్ ఏర్పాట్లు, బర్టర్ ప్లేయ్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలనే తపనతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భావితరాలకు కూడా ఫలాలు ఇస్తాయని పలువురు భావిస్తున్నారు.