Monday, November 25, 2024

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 11 మంది దుర్మరణం

రాజస్థాన్‌లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ట్రక్కు రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సు మీదకు దూసుకెళ్లడంతో 11 మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. భరత్‌పూర్‌లోని హంత్రా సమీపంలో జైపూర్‌-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం వెలుగుచూసింది.

.రాజస్థాన్‌లోని పుష్కర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావన్‌కు బస్సు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున లఖన్‌పూర్ ప్రాంతంలోని అంత్రా ఫ్లైఓవర్ వద్ద బస్సు బ్రేక్‌డౌన్‌ అయ్యింది. డీజిల్‌ అయిపోవడంతో డ్రైవర్‌తో పాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనకాల నిల్చొని ఉన్నారు. అదే సమయంలో వెనకనుంచి వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. .

ఈ దుర్ఘటనలో బస్సు వెనకాల వేచి ఉన్న 11 మంది (అయిదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 12 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అంతు, నంద్రం, లల్లు, భరత్, లాల్జీ, అతని భార్య మధుబెన్, అంబాబెన్, కంబుబెన్, రాముబెన్, అంజుబెన్, మధుబెన్‌గా గుర్తించారు.ఈ ఘనటలో అయిదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement