ప్రభన్యూస్ : ద.ఆఫ్రికా, బ్రిటన్, బ్రెజిల్, బోట్సువానా, చైనా, జింంబాబ్వే, హాంకాంగ్, సింగపూర్ సహా మొత్తం 11 దేశాలను ఒమిక్రాన్ ముప్పు జాబితాలో చేర్చినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. కొవిడ్‌పై చర్చలో భాగంగా ఆయన లోక్ సభకు వివరించారు.
రిస్క్ కేటగిరి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ- పీసీఆర్ పరీక్ష చేస్తున్నామని తెలిపారు. గత ఆరు నెలలుగా అంతర్జాతీయ విమాన సేవలను క్రమంగా పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తూవచ్చాం. ఇంతలో ఒమిక్రాన్ దెబ్బ తగిలింది. అందువల్ల అనేక దేశాలు వేర్వేరు ప్రమాణాలు నిర్దేశించాయని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital