దేశీయ అవసరాల కోసం విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి బిడ్డర్లతో కోల్ ఇండియా సమావేశం నిర్వహించింది. సమావేశానికి మన దేశానికి చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, మాెెహిత్ మినరల్స్, చెట్టినాడ్ లాజిస్టిక్స్ తో పాటు పలు విదేశీ సంస్థలు పాల్గొన్నాయి. సమావేశానికి మొత్తం 11 సంస్థలు హాజరైనట్లు కోల్ ఇండియా తెలిపింది. బొగ్గు దిగుమతి చేసుకోవడానికి అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ పాల్గొనేందుకు ఆసక్తి చూపించిన 11 సంస్థలనతో ఈ నెల 14,17 తేదీల్లో ప్రీ- బిడ్ సమావేశాలు నిర్వహించినట్లు కోల్ ఇండియా తెలిపింది.
దేశీయ అవసరాలకు ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గులో తప్పనిసరిగా 5 శాతం విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయ బిడ్డింగ్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. టెండర్ ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు. బిడ్ ధర చెల్లుబాటును 90 రోజుల నుంచి 60 రోజులకు కుదించారు. మొదటి విడత కార్గోను అందించడానికి 4 నుంచి6 వారాల కాలపరిమితిని నిర్ణయించారు. బిడ్డింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కోల్ ఇండియా ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.