Friday, November 22, 2024

ఏప్రిల్ 3 నుండి 10వ తరగతి పరీక్షలు.. ఏపీలో పకడ్బందీగా ఏర్పాట్లు

APలో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్నాయి. దాదాపు 6,60,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలను ఏడు ప్రాంతీయ భాషలలో రాయనున్నారు. విద్యార్థులు రాష్ట్ర భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, హిందీ, ఉర్దూ, ఒడియా భాషల్లో పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యేందుకు 3,349 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా విద్యార్థులుండగా,, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్లలో అత్యల్పంగా ఉన్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు, మాల్ ప్రాక్టీస్ ను నిరోధించడానికి 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. అదనంగా 104 పరీక్షా కేంద్రాలలో CCTV కెమెరాలు అమర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement