హర్యానాలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి ఖట్టర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023వ విద్యా సంవత్సరానికి సంబంధించిన 10, 12వ తరగతుల పరీక్షలు, DLED పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. హర్యానాకు చెందిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (HBSE) అధికారిక వెబ్‌సైట్ bseh.org.inలో దీని గురించి పూర్తి సమాచారం అందించారు.
అధికారిక నోటీసు ప్రకారం, హర్యానా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు/వరదలు కారణంగా జూలై 21 నుండి షెడ్యూల్ చేయాల్సిన 10వ & 12వ పరీక్షలు, D.Ed 1వ & 2వ సంవత్సరం పరీక్షలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ పరీక్షల కోసం కొత్త తేదీలను బోర్డు త్వరలో విడుదల వెల్లడించనుంది. కాగా, విద్యార్థులు పరీక్ష ఎప్పుడు నిర్వహించబడుతుందనే తాజా అప్‌డేట్‌ల కోసం BSEH అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు