Saturday, November 23, 2024

ప్రయాగ్‌రాజ్‌లో 108 అడుగుల హనుమాన్‌ విగ్రహం.. మహాకుంభమేళా నాటికి మారుతికి పూజలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో క్షేత్ర పాలకుడిగా భక్తుల నుంచి పూజలు అందుకుంటున్న ఆంజనేయ స్వామి 108 అడుగుల విగ్రహాన్ని యమునా నదీ తీరంపై త్రివేణి పుష్ప్‌ ప్రాంతంలో నిర్మించడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు సంకల్పించింది. 2025 సంవత్సరంలో జరిగే మహాకుంభమేళా నాటికి విగ్రహ నిర్మాణం పూర్తి కావాలని నిర్ణయించింది.

ఈ మేరకు త్రివేణి పుష్ప్‌ ప్రాంతంలో విగ్రహంతోపాటుగా పలు నిర్మాణ పనులను హరిద్వార్‌కు చెందిన పరమార్థ్‌ నికేతన్‌కు అప్పగించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే ప్రయాగ్‌రాజ్‌లో బడే హనుమాన్‌ దేవస్థాన సముదాయానికి కొత్త రూపు రేఖలు ఇవ్వడం కోసం దేవస్థానానికి సమీపంలో 11,589 చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించినట్టు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement