Friday, November 22, 2024

దేశవ్యాప్తంగా 10,500 జనౌషధి కేంద్రాలు.. 68.50 కోట్లు మంజూరు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ వ్యాప్తంగా మార్చి 2023 నాటికి 10,500 జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2020-21లో ఈ కేంద్రాల నిర్వహణకు రూ.65.00 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 68.50 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి భగవంత్ ఖుదా తెలిపారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన కేంద్రాల ముఖ్యోద్దేశం, పథకం సమగ్ర సమాచారాన్ని తెలపాలని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నించారు. జనౌషధి కేంద్రాలను ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? నిధుల కేటాయింపు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 2025 నాటికి కేంద్ర లక్ష్యమేంటని ప్రశ్నించారు. దేశంలోని పౌరులందరికీ ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల వారికి నరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలు అందుబాటులో ఉండే లక్ష్యంతో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన పథకాన్ని ప్రారంభించిందని భగవంత్ ఖుదా తెలిపారు. ఇక్కడ బ్రాండెడ్ ఔషధాల ధరల కంటే 50 నుంచి 90 శాతం ధరలు తక్కువగా ఉంటాయని కేంద్రమంత్రి చెప్పారు. జూలై 31, 2022 వరకు దేశవ్యాప్తంగా 8,787 కేంద్రాలు ఏర్పాటు జవాబిచ్చారు. అందులో భాగంగా తెలంగాణలో 176 కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ 162, బీహార్ 308 కార్ఖండ్ 79, మహారాష్ట్రలో 634 కేంద్రాలు ప్రారంభించినట్లు వివరించారు. మార్చి 2023 నాటికి దేశవ్యాప్తంగా 10,500 కేంద్రాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందన్నారు.

బల్క్ డ్రగ్ పార్కులపై నామ ఆరా..

రూ. 3 వేల కోట్లతో దేశంలో డ్రగ్ పార్కుల ఏర్పాటు పథకాన్ని ప్రారంభించామని భగవంత్ ఖుబా వెల్లడించారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనల గురించి కేంద్ర నామా నాగేశ్వరరావు లోక్‌సభలో ప్రశ్నలు వేశారు. 2020-21 నుంచి 2024-25 వరకు ఈ పథకం అమలులో ఉంటుందని తెలిపారు. దీనిపై 13 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. నిధుల పెంపు, కొత్త పార్కుల ఏర్పాటుపై ప్రతిపాదనలేవీ లేవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement