Sunday, December 22, 2024

TG | తెలంగాణలో అటవీ విస్తీర్ణంలో 105.87 కి.మీ తగ్గుదల..

తెలంగాణలోని రికార్డెడ్‌ ఫారెస్ట్‌ ఏరియా, గ్రీన్‌ వాష్‌ (ఆర్‌ఎఫ్‌ఏ, జీడబ్ల్యూ) అటవీ విస్తీర్ణంలో 105.87 కి.మీ తగ్గుదల నమోదైనట్లు కేంద్ర అటవీ శాఖ వెల్లడించింది. శనివారం డెహ్రాడూన్‌లో ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ (ఐఎస్‌ఎఫ్‌ఆర్‌)-2023 ను కేంద్ర అటవీశాఖ మంత్రి భపేంద్ర యాదవ్‌ ఆవిష్కరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8,27,357 చదరపు కిలోమీటర్లలో అటవీ-చెట్ల విస్తీర్ణం ఉన్నట్లు వెల్లడించారు.

ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 25.17శాతంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో 7,15,343 చదరపు కిలోమీటర్లు (21.76) అటవీ విస్తీర్ణం, 1,12,014 చదరపు కిలోమీటర్లు (3.41) చెట్ల విస్తీర్ణం ఉన్నాయని వెల్లడించారు. ఇక ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ ప్రకారం… 2021 నాటి షేప్‌-ఫైల్‌ ఆధారిత అంచనాతో పోలిస్తే, అటవీ – చెట్ల విస్తీర్ణంలో 1,445 చదరపు కిలోమీటర్ల పెరుగుదల నమోదైంది.

ఇందులో అటవీ విస్తీర్ణంలో 156 చదరపు కిలోమీటర్ల పెరుగుదల, చెట్ల విస్తీర్ణంలో 1289 చదరపు కిలోమీటర్ల పెరుగుదల ఉన్నాయి. ఆర్‌ఎఫ్‌ఏ, జీడబ్ల్యూ లోపల అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదలను చూపిస్తున్న మొదటి మూడు రాష్ట్రాల్రు మిజోరాం (242 చదరపు కి.మీ), తరువాత గుజరాత్‌ (180 చదరపు కి.మీ), ఒడిశా (152 చదరపు కి.మీ) నిలిచాయి. ఇందులో అటవీ విస్తీర్ణంలో గరిష్ట తగ్గుదల చూపిస్తున్న రాష్ట్రాల్రు త్రిపుర (116.90 కిమీ2) తరువాత తెలంగాణ (105.87 కిమీ2), అస్సాం (86.66 కిమీ2), ఆంధ్రప్రదేశ్‌ (83.47కిమీ2), గుజరాత్‌ (61.22 కిమీ2)లు ఉన్నాయి.

- Advertisement -

తెలంగాణలో 24.70 శాతం అటవీ విస్తీర్ణం

తెలంగాణలో మొత్తం 11, 207.70 హెక్టార్ల ల్యాండ్‌ ఉపయోగకరంగా ఉందని రిపోర్ట్‌ వెల్లడించింది. ఇందులో 2, 767. 89 (24. 70 శాతం) అడవులు వ్యాప్తిచెంది ఉన్నట్లు పేర్కొంది. కాగా ఫైర్‌ సీజన్‌ లో గతేడాదితో పోల్చితే ఈ సారి జిల్లాల వారిగా అడవుల్లో అగ్ని ప్రమాదాలు పెరిగినట్లు వెల్లడించింది. 2022-23 ఏడాదిలో 13, 117 ప్రమాదాలు గుర్తించగా… ఈ ఏడాది (2023-24) లో 13, 478 ప్రమాదాలు సంబవించినట్లు రిపోర్ట్‌లో కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement