Home ముఖ్యాంశాలు Journalists – యుద్ధరంగంలో క‌లం యోధులు – విధి నిర్వ‌హ‌ణ‌లో అమరులైన 104 మంది జ‌ర్న‌లిస్ట్ లు

Journalists – యుద్ధరంగంలో క‌లం యోధులు – విధి నిర్వ‌హ‌ణ‌లో అమరులైన 104 మంది జ‌ర్న‌లిస్ట్ లు

0
Journalists –   యుద్ధరంగంలో క‌లం యోధులు – విధి నిర్వ‌హ‌ణ‌లో అమరులైన 104 మంది జ‌ర్న‌లిస్ట్ లు

ప్రాణాల‌కు తెగించి వార్తా సేక‌ర‌ణ
విధి నిర్వ‌హ‌ణ‌లో ఒక్క ఏడాదిలో104 మంది జ‌ర్న‌లిస్ట్ లు మృతి
ఒక్క గాజాలోనే 81 మంది విలేఖరులు ప్రాణ త్యాగం

కాలిఫోర్నియా – ప్ర‌పంచంలో ఏమూల ఏం జ‌రిగినా, అది సంతోషకరమైన వార్తయినా, కన్నీళ్ళు పెట్టించే సమాచారమైనా ప్రజలకు తెలియజేయడంలో జర్నలిస్టు లు కీలకపాత్ర . ఇటీవ‌ల కాలంలో యుద్ధ‌రంగంలో సైతం ప్రాణాల‌కు తెగించి క‌లం వీరులు వార్త‌ల సేక‌ర‌ణ చేసి ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తున్నారు. ఈక్రమంలో గాజాలో నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన విషయాలను ప్రపంచానికి తెలియజేయాల్సిన జర్నలిస్టులు అదే యుద్ధంలో మరణించడం విచారకరం. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 104 మంది జర్నలిస్టులు మృతి చెందారు. అందులో81 మంది గాజా లోనే మరణించడం గమనార్హం. ఈమేరకు ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్ ఓ నివేదికలో వెల్లడించింది. ఏడాదిలో 104 మంది జర్నలిస్టులు మృతి చెందారు. అయితే, 2023 ఏడాదిలో ఆ సంఖ్య 129గా ఉంది. అయినప్పటికీ అత్యంత ఘోరమైన సంవత్సరాల్లో 2024 నిలిచిందని ఐఎఫ్‌జే ప్రధాన కార్యదర్శి ఆంథోనీ బెల్లాంగర్ పేర్కొన్నారు.

2023 అక్టోబరు 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 14 నెల‌ల కాలంలో గాజాలో కనీసం 138 మంది జర్నలిస్టులు మృతి చెందారు. వారిలో చాలామందిని ఉద్దేశపూర్వకంగా చంపేయగా మరికొందరు యుద్ధంలో మరణించారు అని తెలిపారు. ఆసియాలో 20 మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు తెలిపింది. వారిలో ఆరుగురు పాకిస్థాన్ లో, ఐదుగురు బంగ్లాదేశ్ , నలుగురు ఉక్రెయిన్ యుద్ధంలో, ముగ్గురు భారత్ లో మరణించినట్లు పేర్కొంది

జైళ్ల‌లో మ‌గ్గుతున్న 520 మంది వార్తాహ‌రులు
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 520 మంది జర్నలిస్టులు జైలులో ఉన్నట్లు ఐఎఫ్‌జే తెలిపింది. గతేడాది ఈ సంఖ్య 427గా ఉంది. ఇందులో చైనా మొదటిస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. దాదాపు 135 మంది జర్నలిస్టులను హాంకాంగ్‌లో నిర్బంధించినట్లు పేర్కొంది.. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను ప్ర‌శ్నించిన జ‌ర్న‌లిస్ట్ లే అధికంగా జైలులో ఉంటున్నార‌ని నివేదిక వెల్ల‌డించింది.

Exit mobile version