Friday, November 22, 2024

ఏపీలో పామ్‌ ఆయిల్ సాగు అభివృద్ధికి రూ.104 కోట్లు.. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో రూ. 104 కోట్లతో పామ్‌ ఆయిల్ సాగును అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ 2022-23 సంవత్సర వార్షిక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 20 వేల హెక్టార్లు పామ్‌ ఆయిల్ సాగుకు అనువైనదిగా గుర్తించి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5 లక్షల 31 వేల హెక్టార్లు పామ్‌ ఆయిల్‌ సాగుకు అనువుగా ఉన్నట్లు తెలిపారు.

దేశంలో పామ్‌ ఆయిల్‌ సాగు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 62 కోట్లు కేటాయించగా అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 41 లక్షలు తన వాటాగా భరించాల్సి ఉందని అన్నారు. పామ్‌ ఆయిల్ సాగును పెద్ద ఎత్తున విస్తరించి క్రూడ్ పాం ఆయిల్ ఉత్పత్తిని పెంచడం ద్వారా వంట నూనెల దిగుమతులను తగ్గించడమే ఈ మిషన్ లక్ష్యం అని మంత్రి చెప్పారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్‌ రీసెర్చ్ గణాంకాల ప్రకారం దేశంలో 28 లక్షల హెక్టార్లలో పామ్‌ ఆయిల్ సాగును అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న 5 ఏళ్ళలో దేశంలో అదనంగా 6.5 లక్షల హెక్టార్లలో పామ్‌ ఆయిల్ సాగును అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement