మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఆదాయపన్ను శాఖ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ కు చెందిన సుమారు రూ. 1000 కోట్ల ఆస్తులను ఆదాయపన్ను శాఖ సీజ్ చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గోవాలలో ఈ ఆస్తులు ఉన్నాయి. ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద ఉన్న నిర్మల్ టవర్‌ను కూడా జప్తు చేసినట్లు తెలుస్తోంది.
గత నెలలో నిర్వహించిన ఐటీశాఖ అధికారులు పవార్ బంధువుల ఇళ్లపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.184 కోట్ల ఆదాయాన్ని గుర్తించారు. అజిత్ తన ఆస్తులను న్యాయమైన పద్ధతిలో ఆర్జించలేదని ఐటీశాఖ పేర్కొంది. అజిత్ కుటుంబంపై యాంటీ బినామీ చట్టం కింద కేసు నమోదు చేశారు.