హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంటర్‌లో వంద శాతం సిలబస్‌కు ఇంటర్ బోర్డు ఆమోదం తెలిపింది. కోవిడ్‌కు ముందు ఉన్న పాత విధానంలోనే ఇంటర్ పరీక్షలను ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు నిర్వహించనున్నది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 70 శాతం సిలబస్ నిబంధనను ఎత్తివేస్తూ 100 శాతం సిలబస్‌ను అమలు చేయనున్నట్లు ఇంటర్ బోర్డులోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మోడల్ ప్రశ్నపత్రాలను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లు కళాశాలు సరిగా నడవలేదు. దీంతో ఈ ప్రభావం పరీక్షలపై పడుతుందన్న ఉద్ధేశ్యంతో వంద శాతం ఉన్న సిలబస్‌లో 30 శాతాన్ని తగ్గిస్తూ 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించారు.
ప్రశ్నపత్రాల్లో ప్రశ్నల ఛాయిస్‌ను కూడా పెంచారు. దీంతో విద్యార్థులు పరీక్షలు సులువుగా రాశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వంద శాతం సిలబస్‌ను బోధించనున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇయర్ వాళ్లకు ఇబ్బంది కలగకుండా అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి బ్రిడ్జి కోర్సుల ద్వారా ఫస్ట్ ఇయర్ పాఠ్యాంశాలను బోధించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.