ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పడి వంద రోజులు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం మాట్లాడారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, ప్రజలు వాటికి సాక్ష్యాలుగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు.
అమిత్ షాతో పాటు మంత్రులు అశ్వినీ వైష్ణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 రోజుల పాలనలో సాధించిన ప్రగతిపై రూపొందించిన ఓ బుక్‌లెట్‌ను అమిత్ షా ఆవిష్కరించారు.అమల్లోకి కొత్త విద్యా విధానం పదేళ్ల అభివృద్ధి, భద్రత, సంక్షేమం తర్వాత ప్రజలు మూడవ సారి బీజేపీ మిత్ర కూటమిని మరోసారి ఆశీర్వదించారని ఆయన పేర్కొన్నారు. గడిచిన 60 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.
ఇది దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందని, పాలసీలను సమర్థవంతంగా అమలు చేశామన్నారు. ప్రధాని మోదీ తీసుకువచ్చిన కొత్త విద్యా విధానంలో.. ప్రాచీన, ఆధునిక విద్యా వ్యవస్థలు ఉన్నట్లు తెలిపారు. ఆ విద్యా వ్యవస్థ ప్రాంతీయ భాషలను గౌరవిస్తుందని హోంమంత్రి తెలిపారు.మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులు..వంద రోజుల పాలన సమయంలో.. సుమారు మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.
గత పదేళ్లలో ఇండ్లు, టాయిలెట్లు, గ్యాస్ కనెక్షన్లు, త్రాగునీరు, విద్యుత్తు, ఉచిత ఆహార ధాన్యాలు, ఆరోగ్యం అందించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు దేశంలో ఇండ్లు లేని వారు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయనున్నట్లు అమిత్ షా తెలిపారు.