భారత్-చైనా దేశాల మధ్య వాణిజ్యం 2022లో 135.98 బిలియన్ డాలర్లుగా రికార్డ్ స్థాయికి చేరింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నా, చైనాతో భారత వాణిజ్యలోటు తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. చైనా వార్షిక కస్టమ్స్ గణాంకాల ప్రకారం భారత్-చైనా మధ్య 2021లో 125 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. 2022లో అది 8.4 శాతం పెరిగి 135.98 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్‌కు చైనా ఎగుమతుల విలువ 21.7 శాతం పెరిగి 118.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇదే సమయంలో భారత్ నుంచి చ ఐనా చేసుకున్న దిగుమతుల విలువ 2022లో 37.9 శాతం తగ్గి 17.48 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఫలితంగా 2021లో 69.38 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 101.02 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్‌లో ఈ అంశంపై తరచూ ఆందోళన వ్యక్తమవుతున్నది. 20021లో తొలిసారి భారత్-చైనా దేశాల మధ్య వాణిజ్యం 100 బిలియన్ డాలర్ల స్థాయిని దాటి 125.62 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది వార్షిక ప్రాతిపదికన 43.32 శాతం అధికం. వాణిజ్య లోటు 69.56 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత్‌కు చైనా ఎగుమతులు 46.14 శాతం పెరిగి 97.59 బిలియన్ డాలర్లుకు చేరాయి. తూర్పు లద్డాక్‌లో భారత్-చైనా మధ్య సైనిక ఘర్షణలు తెలెత్తినప్పటికీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
అయినప్పటికీ రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతున్నది. రెండు దేశాల మధ్య వాణిజ్యం ఏటా 12.55 శాతం వృద్ధి చెందుతున్నది. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ గత ఏడాది చైనా వాణిజ్య మిగులు 877.6 బిలియన్ డాలర్లకు చేరింది. కొవిడ్‌తో అనేక దేశాలతో సంబంధాలు దెబ్బతిననప్పటికీ, చైనా వాణిజ్య మిగులు గణనీయంగా పెరిగింది. చైనా ఎగుమతుల విలువ 3.95 ట్రిలియన్ డాలర్లకు చేరింది. దిగుమతులు 1.1 శాతం వృద్ధి చెంది 2.7 ట్రిలియన్ డాలర్లకు పెరిగాయి.