Wednesday, November 20, 2024

ఇండియా -యూఏఈ మధ్య 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం

ఇండియా- యూనిటైడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) మధ్య నాన్‌-పెట్రోలియం ద్వైపాక్షి వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పై యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి థానీ బిన్‌ అహ్మద్‌ అల్‌ జియోదీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

ప్రస్తుతం మన దేశం యూఏఈ నుంచి 12,756 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్రోలియం ముడి చమురును, 6,862 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై రెండు దేశాలు సంతకాలు చేసిన తరువాత అని రకాల వస్తువుల వస్తువుల ఎగుమతులు, దిగుమతులకు అవకాశం కలుగుతుంది. మన దేశం వైపు నుంచి 11,908 టారిఫ్‌ లైన్స్‌, యూఏఈ వైపు నుంచి 7581 టారీఫ్‌ లైన్స్‌ ఈ ఒప్పందంలో కవర్‌ అవుతాయి.

గత సంవత్సరం మే నెలలో మన దేశం, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తరువాత మన దేశంలో పెట్టుబడులు పెట్టిన దేశాల్లో 4వ అతి పెద్ద దేశంగా యూఏఈ అవతరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా యూఏఈ నుంచి మన దేశానికి భారీగా పెరిగాయి. 2022-23లో మన దేశానికి 3.35 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు యూఏఈ నుంచి మన దేశానికి వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement