Tuesday, November 19, 2024

New Act: పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తే 10 ఏళ్లు జైలు ..కోటి జరిమానా ..

పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరోధించడానికి కేంద్రం ఒక చట్టాన్ని తీసుకు రానుంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే ఈ నెల అయిదో తేదిన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి గరిష్ఠంగా 10 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు.

ఈ బిల్లు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని తేవడం లేదని, పరీక్షల పేరుతో అక్రమాలకు పాల్పడే మాఫియా, వ్యవస్థీకృత ముఠాలతో పాటు, వీటితో కుమ్మక్కయ్యే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కోసమని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు. దీనిపై అధ్యయనం చేసిన అత్యున్నత స్థాయి సాంకేతిక కమిటీ కంప్యూటరైజ్డ్‌ పరీక్షా విధానం అత్యంత సురక్షితమని సిఫార్సు చేసింది. ముఖ్యంగా జేఈఈతో పాటు కేంద్ర యూనివర్సిటీలతో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలలో అక్రమాల నిరోధానికి ఈ బిల్లును తెస్తున్నారు. ఈ బిల్లు పాస్ అయిన వెంట‌నే దేశంలోని అన్ని పోటీ ప‌రీక్ష‌ల‌కు ఈ కొత్త చ‌ట్టం వ‌ర్తిస్తుంద‌ని కేంద్రం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement