Friday, November 22, 2024

Exclusive | బీజేపీ ఎంపీ ఇంట్లో బాలుడి మృతదేహం.. ఇంతకీ ఏం జరిగిందంటే!

బీజేపీ ఎంపీ ఇంట్లో ఓ పదేళ్ల బాలుడి మృతదేహం దొరికింది. ఆ బాలుడి మెడకు గుడ్డ చుట్టి చంపేసినట్టు ఆధారాలున్నాయి. ఈ ఘటన అస్సాంరాష్ట్రం సిల్చార్​లో జరిగింది. ఆ బాలుడి తల్లి రెండున్నరేళ్లుగా బీజేపీ ఎంపీ ఇంట్లో పనిచేస్తున్నట్టు సమాచారం అందుతోంది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

అస్సాం రాష్ట్రం సిల్చార్‌లోని బీజేపీ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ నివాసంలో పదేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం మెడకు గుడ్డ చుట్టి కనిపించిందని కాచర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) సుబ్రతా సేన్ తెలిపారు. బాలుడి తల్లి రెండున్నరేళ్లుగా బీజేపీ ఎంపీ ఇంట్లో పనిచేస్తోందని, ఆమె అసలు ధోలై ప్రాంతానికి చెందినదని ఏఎస్పీ తెలిపారు.

రాజ్‌దీప్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. తనకు “ఎమర్జెన్సీ” గురించి సమాచారం అందిందని, తన ఇంట్లో ఓ బాలుడి మృతదేహం ఉన్నట్టు తనకు పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. ఆ బాలుడు ఉరేసుకుని చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారని, ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారన్నారు.  పోలీసు అధికారులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సిల్చార్ మెడికల్ కాలేజీకి పంపించారు.

- Advertisement -

‘‘నాకు ఇంట్లో ఎమర్జెన్సీ గురించి సమాచారం అందింది. ఆ విషయం తెలియగానే నేను పరుగెత్తాను. ఇంటికి చేరుకున్న తర్వాత ఒక కుటుంబం ఉందని కనుగొన్నాను. వారు కార్మికులు, వారికి ఇద్దరు పిల్లలున్నారు .- 5వ తరగతి చదువుతున్న ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు” అని ఎంపీ రాజ్‌దీప్ రాయ్ అన్నారు.

ఈ విషయమై తాను సిల్చార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)తో మాట్లాడానని.. ఆత్మహత్యగా భావిస్తున్నట్లు తనకు చెప్పారని బీజేపీ ఎంపీ అన్నారు. ఘటన జరిగిన సమయంలో తాను పార్టీ కార్యాలయంలోనే ఉన్నానని చెప్పారు. ప్రోటోకాల్, మార్గదర్శకాల ప్రకారం పోలీసు విచారణ జరుగుతుందని రాజ్‌దీప్ రాయ్ చెప్పారు.

కాగా ఎంపీ భవనం మొదటి అంతస్తులో ఆ కుటుంబం నివసిస్తోంది. చిన్న పిల్లవాడు మంచి అబ్బాయి. నేను అతనిని వ్యక్తిగతంగా పాఠశాలలో చేర్పించాను. అతని తల్లిదండ్రులు కూడా మంచివారే. ఆ కుటుంబం అంతా కలిసి భోజనం చేశారని ఆ తర్వాత తల్లి కూతుళ్లిద్దరూ బ యటకు వెళ్లినట్టు వారు చెప్పారన్నారు. అప్పుడు ఆ బాలుడు తన తల్లిని ఫోన్‌ కావాలని అడిగితే ఇవ్వకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తాము భావిస్తున్నట్టు తెలిపాడు.  వారు అరగంట తర్వాత తిరిగి వచ్చినప్పుడు తలుపు లోపల నుండి లాక్ చేసి ఉందని, ఆ తర్వాత ఇంట్లో బాలుడు ఉరేసుకున్నట్టు చెప్పారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement