లోక్‌సభ ఎన్నికల పుణ్యమా? అంటూ రాజ్యసభలో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో త్వరలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ రానుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్యసభ ఎంపీలు లోక్‌సభ ఎంపీలుగా గెలుపొందారు. దీంతో వారు రాజ్యసభ స్థానాలను వదులుకోనున్నారు. అసోం, బీహార్, మహారాష్ట్రల నుంచి రెండు చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర నుంచి ఒక్కో స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది.
లోక్‌సభ ఎంపీలుగా గెలిచిన వారు వీరే..
కామాఖ్య ప్రసాద్ తాసా, సర్బానంద సోనోవాల్ (అసోం), మీసా భారతి, వివేక్ కుమార్ (బీహార్), ఉదయన్‌రాజే భోంస్లే, పీయూష్ గోయల్ (మహారాష్ట్ర), దీపేందర్ సింగ్ హుడా (హర్యానా), కేసీ వేణుగోపాల్ (రాజస్థాన్), బిప్లబ్ కుమార్ దేబ్ (త్రిపుర), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్)లు ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా లోక్‌సభ ఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి గెలుపొందారు. రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించనుంది.