సూపర్ ఫాస్ట్ బ్యాటరీని ఆవిష్కరించిన చైనా కంపెనీ కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ (సీఏటీఎల్) కేవలం 10 నిముషాల ఛార్జ్‌తో 400 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ అందించే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని విడుదల చేసినట్లు తెలిపింది. ఇది ప్రపంచంలోనే మొదటి 4సీ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎల్‌ఈపీ బ్యాటరీని తెలిపింది. ఈ బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 700 కి.మీ రేంజ్ ఇస్తుందని ప్రకటించింది.
లిథియం-ఐయాన్ డెవలప్‌మెంట్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఈవీ వాహనాల ఆందోళనను తగ్గించేందుకు విస్త్రతంగా దీన్ని తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ బ్యాటరీకి కంపెనీ షెన్జింగ్ అని పేరు పెట్టింది. ఈ షెన్జింగ్ బ్యాటరీ అత్యంత వేగంగా ఛార్జ్ కావడంతో పాటు లాంగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీ నిర్మాణం అత్యంత సురక్షితమైనదని, ఆధునిక టెక్నాలజీతో రూపొందించినట్లు తెలిపింది.
షెన్జింగ్ బ్యాటరీ 0-80 శాతం ఛార్జింగ్‌ను కేవంల 10 నిముషాల్లోనే చేస్తుందని, ఇందులో సెల్ టెంపరేచర్ కంట్రోల్ టెక్నాలజీతో నిర్మితమైనందని కంపెనీ తెలిపింది. ఉష్టోగ్రతలు మైనస్ 10 డిగ్రీలు ఉన్న ప్రాంతాల్లోనూ ఇది 0-80 శాతం ఛార్జింగ్‌ను 30 నిముషాల్లో పూర్తి చేస్తుందని తెలిపింది.
ఈ బ్యాటరీలను భారీ స్థాయి ఉత్పత్తిని సంవత్సరం చివరి నాటికి సాధిస్తామని, ఈ బ్యాటరీలతో నడిచే విద్యుత్ వాహనాలు వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ సూపర్ ఫాస్ట్ బ్యాటరీలను వినియోగించే కంపెనీల పేర్లను కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కంపెనీకి బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, హ్యుండాయ్, హోండా, టెస్లా, టయోటా, వోక్సోవాగన్, వోల్వో, పీఎస్‌ఏ గ్రూప్ కస్టమర్లుగా ఉన్నాయి.