Friday, November 22, 2024

స‌స్పెన్ష‌న్‌ కు గురైన 10 మంది లోక్ సభ ఎంపీలు..

లోక్ సభలో విపక్షాల ఆందోళనల నేపథ్యంలో స్పీక‌ర్ ఓం బిర్లా సీరియ‌స్‌గా తీసుకున్నారు. లోక్ సభలో పెగాస‌స్ అంశం, సాగు చ‌ట్టాల ర‌ద్దు లాంటి అంశాల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విపక్షాలు పట్టుడుతున్న విషయం తెలిసిందే. అయితే చర్చకు స్పీకర్ ఆహ్వానించకపోవడంతో కొందరు ఎంపీలో వెల్ లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే . ఓ ద‌శ‌లో కొంద‌రు విప‌క్ష ఎంపీలు చైర్‌పైకి పేప‌ర్లు విసిరేశారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల స్పీక‌ర్ ఓం బిర్లా సీరియ‌స్‌గా ఉన్నారు. ప‌ది మంది ఎంపీల‌పై ఆయ‌న వేటు వేశారు. స‌స్పెన్ష‌న్‌కు గురైన ఎంపీల్లో మానికం ఠాగూర్‌, డీన్ కురియ‌కోజ్‌, హిబ్బి హిడ‌న్‌, జోయిమ‌ని, ర‌వ‌నీత్ బిట్టు, గుర్జీత్ ఔజ్లా, ప్ర‌తాప‌న్‌, వైథిలింగం, స‌ప్త‌గిరి శంక‌ర్‌, ఏఎం ఆరిఫ్‌, దీప‌క్ బైజ్‌లు ఉన్నారు. చైర్ ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించినందుకు రూల్ 374(2) ప్ర‌కారం ప‌ది మంది ఎంపీల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఒక‌వేళ ఎవరైనా స‌భ్యులు భ‌విష్య‌త్తులో ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తే, వారిని లోక్‌స‌భ ట‌ర్మ్ మొత్తం బ‌హిష్క‌రించ‌నున్న‌ట్లు స్పీక‌ర్ బిర్లా వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి : కర్ణాటక కొత్త సీఎంగా బొమ్మై ప్రమాణం

Advertisement

తాజా వార్తలు

Advertisement