Friday, November 22, 2024

Big story : కేంద్ర ఉద్యోగాల్లో 10లక్షల ఖాళీలు.. 2014లో 10లక్షల ఉద్యోగ భర్తీకి హామీనిచ్చిన ప్రధాని మోడీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉద్యోగ భర్తీలో తెలంగాణకు ఏ రాష్ట్రంకానీ, కేంద్రం కానీ కనుచూపుమేరలో నిలవడంలేదు. రికార్డు స్థాయిలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీతో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం ఒకవైపు రికార్డులు సృస్టిసంతుండగా, నానాటికీ తీవ్రమవుతున్న నిరుద్యోగితరేటు జాతీయ స్థాయిలో కేంద్రానికి చెడ్డపేరు తెస్తోంది. ఆల్‌టైం రికార్డుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు చేరడంతో జాతీయస్థాయిలో మోడీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఆల్‌టైం రికార్డుకు చేరాయి. కేంద్రంలోని అన్ని శాఖల్లో కలుపుకుని 41.11శాంక్షన్‌ పోస్టులు ఉండగా, మొత్తంగా 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా పేర్కొంది. దీంతో తెలంగాణ వంటి ఎదుగుతున్న రాష్ట్రాలపై కేంద్రం చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలేనని, కేంద్రమే నిరుద్యోగులపట్ల చిత్తశుద్దిలోపంతో ఉందని స్పష్టమవుతోంది. అంటే ఈ లెక్కన కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు 24.27శాతంగా ఉంటూ ప్రతీ మూడు ఉద్యోగాల్లో ఒకటి ఖాళీగా ఉందనే వాస్తవం కేంద్ర ప్రభుత్వ పాలనకు అద్ధం పడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన 2014లో ప్రధానీ మోడీ జాతినుద్దేశించి రానున్న ఏడాదిన్నరలో 10లహామీ ఇప్పటిదాకా నెరవేర్చడంలో విఫలమయ్యారనే స్పష్టమవుతోంది. అంటే 2022లో కేంద్రం ప్రకటించిన ఖాళీలు 9.79లక్షలుకాగా, 2014లో మోడీ భర్తీ చేస్తామన్న హామీకి అతిదగ్గరలో 10లక్షలకు చేరింది.

నిరుద్యోగులను నియామకాల దిశగా రెచ్చగొడుతున్న బీజేపీ రాష్ట్రంలో, కేంద్రంలో ధ్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్‌, సివిల్‌తోపాటు, రక్షణ రంగం, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కలుపుకుని దేశమంతటా ఈ ఖాళీల మొత్తం 15లక్షల 62వేల 912గా తేలింది. వీటిని దేశమంతటా ఖాళీగా పెట్టిన కేంద్ర ప్రభుత్వం గురివింద గింజ సామెతలా తెలంగాణపై విమర్శలు చేస్తున్నది. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గడచిన ఎనిమిదేళ్లలో కొత్త రాష్ట్రం తనను తాను కాపాడుకుంటూనే అన్ని రంగాల్లో ఒడిదుడుకులను తట్టుకుంటూ ఒక లక్షా 30వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. దేశంలో నిరుద్యోగ రేటు 3.3శాతంనుంచి 7.2శాతానికి ఇదే కాలంలో ఎదిగింది. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతీ ఐదు శాంక్షన్‌ పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉందని తేలింది. దీంతో జాతీయ స్థాయిలో కేంద్ర ఖాళీలు 24.27శాతానికి పెరిగాయి. కేంద్ర సర్వీసుల్లో 8లక్షలు, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లలో 8లక్షలు ఖాళీగా ఉన్నాయి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపి ఈ హామీని నీరుగార్చింది. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మంజూరీ స్ట్రెంగ్త్‌ 40లక్షలుగా ఉంది. కానీ రెండు కోట్లు భర్తీ చేస్తామని అలవికాని, ఆచరణ సాధ్యంకాని హామీలను బీజేపీ వెల్లడించింది. 2020నాటికి కేంద్రంలో మంజూరీ అయిన పోస్టులు 41.11 లక్షలుకాగా, వీటిలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య 32 లక్షలుగా ఉంది.

దీంతో ఖాళీల సంఖ్య 9,79,327గా ఖరారైంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసి క్యాటగిరీల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టులు భారీగా ఖాళీలున్నాయి. ఎస్సీల్లో 14,366, ఎస్టీ వర్గాలకు చెందిన 12,612, బీసి వర్గాల్లో 15,088 ఖాళీలున్నాయి. అయితే మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా అంటూ కొత్త ఉద్యోగాల సంగతి పక్కనపెడితే ఖాళీలనే భర్తీ చేయలేకపోయింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, దేశంలో అభివృద్ధికి ఊతంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయానికి పెట్టడం ఆందోళన కల్గిస్తోంది. దీంతో గడిచిన ముప్పై ఏళ్లలో ఏనాడూ లేనంతగా నిరుద్యోగితా శాతం దేశంలో రెండింతలకు పెరిగింది. 2014లో 3.3 శాతంగా ఉన్న నిరుద్యోగ శాతం 2020లో 7.2శాతానికి చేరింది. ఇండియన్‌ రైల్వేలలో గ్రూప్‌ సి, గ్రూప్‌ డి పోస్టులు 72వేలను కేంద్రం అబాలిష్‌ చేసింది. ప్రభుత్వరంగ సంస్థల్ల్లో -5.4శాతానికి నిరుద్యోగిరేటు పెరిగింది, 2021-22నాటికి 8.5లక్షలనుంచి 9.1లక్షలకు నిరుద్యోగ శాతం, ఖాళీల సంఖ్య చేరింది. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో 5శాతం పోస్టులు అంటే 38,147ఖాళీలున్నాయని కేంద్రం వెల్లడించింది.

ఈ రంగంలో శాంక్షన్‌ పోస్టులు 7.63లక్షలుగా ఉంది. ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నద విద్య పోస్టులు భారీగా ఖాళీలులున్నాయి. సెంట్రల్‌ యూనివర్సిటీలలో 6558ఖాళీగా ఉండగా, ఐఐటీలలో 4370, ఐఐఎంలలో 422 పోస్టులు ఖాళీలున్నాయి. నాన్‌ సివిలైజేషన్‌ పోస్టుల్లో భాగంగా సెంట్రల్‌ ఆర్మడ్‌ పోలీస్‌ ఫోర్స్‌, అస్సాం రైఫిల్స్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పిఎఫ్‌, ఐటీబిపి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌జీ, పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ తదితర వాటిల్లో శాంక్షన్‌ స్ట్రెంగ్త్‌ 11.09లక్షలుకాగా, 11.6శాతంతో 1.29లక్షలు ఖాళీలున్నాయి. అదేవిధంగా త్రివిద దళాల్లో ఆర్మీ, నేవీ, వాయుసేనలలో 1.46లక్షల ఖాళీలు రక్షణరంగంలో కేంద్రానికి ఉన్న నిబద్ధతతను తెలియజేస్తోంది. ఏడాదికి 60వేల సైనికల బలగాలను రిక్రూట్‌ చేసుకోవాల్సి ఉండగా, పాండమిక్‌ కారణంగా గడచిన రెండేళ్లుగా భర్తీలు లేవు. కేవలం 37,301 ఖాళీలను పూరించారు. అగ్నిపథ్‌ పథకంలో 46వేల భర్తీ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. దీంతో ఈ రంగంలో 13లక్షలనుంచి స్ట్రెంగ్త్‌ 11 లక్షలకు పడిపోయింది. పబ్లిక్‌ సెక్టార్‌ రంగంలోనూ ఏమంత ప్రగతి కానరావడంలేదు. 2022నాటికి 17.4శాతం ఖాళీలున్నాయి. ఈ నేపథ్యంలో యాన్యువల్‌ పే రీసెర్చ్‌ యూనిట్‌ ఆఫ్‌ డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ తెలిపిన వివరాల ప్రకారం సివిల్‌ ఉద్యోగాలు 2018లో 17.8 శాతం, 2019లో 22.7శాతం, 2020లో 21.7శాతం , 2021లో 2.2 శాతం పెరిగిందని వెల్లడించింది, కానీ ఖాళీలు, శాంక్షన్‌ స్ట్రెంగ్త్‌ పరిశీలిస్తే వాస్తవంగా ఖాళీల సంక్య 10లక్షలకు చేరుకుంది.

ఇక దేశ ప్రగతికి కారకమయ్యే రైల్వేలు దుస్థితిలోకి నెట్టివేయబడ్డాయి. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు దేశంలోని 16 జోన్ల ద్వారా గ్రూప్‌ డి 1,03,769 ఖాళీలను భర్తీ చేసేందుకు 2019లో నోటిఫికేషన్‌ జారీ చేసి ఇప్పటివరకు ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. ఇక కేంద్ర ప్రభుత్వంలోని కీలక పాలనాశాఖల్లో భారీగా ఖాళీలు నెలకొన్నాయి. రెవెన్యూలో 45శాతం, డిఫెన్స్‌లో 31శాతం, వైద్యంలో 28శాతం, పోస్టల్‌లో 24శాతం, రైల్వేలో 16శాతం, హోంలో 8శాతం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41శాతం ఖాళీలున్నాయి. వీటిని ఖాళీలు పెట్టిన కేంద్రం పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిన్వెస్ట్‌ మెంట్‌ చర్యలు తీసుకొంది. కొన్నింటిని ప్రైవేట్‌ పరం చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లను బలోపేతం చేసింది. ఆర్టీసితోపాటు పలు కార్పొరేషన్లకు ఆర్ధిక సాయం చేసి ఆదుకుంటోంది. నష్టాలను భరించేందుకు తనవంతు చేయూతనిస్తోంది. ఇలా దేశంలోని అన్ని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఉద్యోగ కల్పనతోపాఉట, పీఆర్సి వంటి చర్యలు ఆదర్శంగా మారాయి. కానీ తెలంగాణలో ఏడేళ్లలో 1.30లక్షల ఉద్యోగాలను బర్తీ చేసి మరో 80039 ఉద్యోగ భర్తీ ప్రక్రియ పురోగతిలో ఉంది. ఆర్టీసి కార్మికులనుంచి అందరికి 30శాతం పీఆర్సీ అమలు చేసింది. తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మేలు చేసే చర్యలకు కేంద్ర జాప్యమే కారణంగా నిల్చింది. జోనల్‌ విధానానికి కేంద్రం అనేక కొర్రీలతో తీవ్ర ఆటంకాలు సృష్టించింది. గడచిన నాలుగేళ్లుగా ఎదురైన జోనల్‌, స్థానికత సమస్యలు తీరడంతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు సర్కార్‌ సమాయత్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement