విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకు గో ఫస్ట్ ఎయిర్‌వేస్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ వేవియేషన్ (డీజీసీఏ) 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇటీవల గో ఫస్ట్ విమానం బెంగళూర్ ఎయిర్‌పోర్టులో 55 మంది ప్రయాణికులను వదిలేసి ఢిల్లి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయి నివేదిక కోరిన డీజీసీఏ, తాజా ఘటనతో టెర్మినల్ కోఆర్డినేటర్, కమర్షియల్ సిబ్బంది, బోర్డింగ్ సిబ్బందికి మధ్య సమాచార లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఎయిర్‌లైన్స్ విఫమైందని డీజీసీఏ పేర్కొంది. దీనికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు గో ఫస్ట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రయాణికులు విడిచి విమానం వెళ్లిపోయినట్లు తమ వివరణలో పేర్కొంది. విమానాశ్రయంలో వదలిన 55 మంది ప్రయాణికులకు ఏడాదిలోపు దేశంలో ఎకకడికైనా ఒకసారి ఉచితంగా ప్రయానించే అవకాశం కల్పిస్తున్నట్లు గో ఫస్ట్ ఎయిర్ ప్రకటించింది.