Saturday, November 23, 2024

కేర‌ళ బోటు ప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు 10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

కేర‌ళలోని తన్నూర్ ప్రాంతం తూవ‌ల‌తీరం బీచ్ వ‌ద్ద ఆదివారం రాత్రి బోటు బోల్తాప‌డిన ఘ‌ట‌న‌లో 22 మంది మృతిచెందారు. బోటు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల‌ను ఈరోజు సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ క‌లిశారు. బాధిత కుటుంబాల‌కు 10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల జుడిషియ‌ల్ విచార‌ణ‌కు సీఎం ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్ర‌మాదం ఓ విషాద‌మ‌ని, చికిత్స పొందుతున్న వారి ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌న్నారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు నిపుణుల‌తో కూడిన జుడిషియ‌ల్ క‌మీష‌న్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సీఎం చెప్పారు. కేర‌ళ ప్ర‌భుత్వం బాధిత కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించ‌గా.. కేంద్ర ప్ర‌భుత్వం రూ.2 ల‌క్ష‌లు ఇవ్వ‌నుట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement