కేరళలోని తన్నూర్ ప్రాంతం తూవలతీరం బీచ్ వద్ద ఆదివారం రాత్రి బోటు బోల్తాపడిన ఘటనలో 22 మంది మృతిచెందారు. బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఈరోజు సీఎం పినరయి విజయన్ కలిశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటన పట్ల జుడిషియల్ విచారణకు సీఎం ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం ఓ విషాదమని, చికిత్స పొందుతున్న వారి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టేందుకు నిపుణులతో కూడిన జుడిషియల్ కమీషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. కేరళ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించగా.. కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు ఇవ్వనుట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement