Tuesday, November 26, 2024

ప్ర‌పంచ కుబేరుల జాబితాలో 10 మంది హైద‌రాబాదీలకు చోటు.

హైదరాబాద్‌ నగరం పెట్టుబడులను ఆకర్షించడమే కాదు ఏడాదికేడాది బిలియ‌నీర్ల‌ను తయారు చేసుకుంటూ వెళ్తోంది. తాజాగా ప్రకటించిన హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితా-2021లో నగరానికి చెందిన 10 మందికి చోటు దక్కింది. దివి, హెటిరో, రెడ్డి ల్యాబ్స్ తో పాటు మెగా, మై హోం వంటి సంస్థ‌లు ఈ బిలియ‌న‌ర్ ల జాబితాలో చేరాకి..
నగరానికి చెందిన బిలియనీర్‌ల జాబితా ఈ విధంగా ఉంది.

  • మురళి దివీ. దివీస్‌ ల్యాబోరేటరీస్‌. రూ.54,100 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 20వ స్థానం అదే ప్రపంచవ్యాప్తంగా 385వ స్థానం.
  • పీవీ రాంప్రసాద్‌ రెడ్డి. అరబిందో ఫార్మా. రూ.22,600 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 56వ స్థానం అదే ప్రపంచవ్యాప్తంగా 1,096వ స్థానం
  • బి. పార్ధసారథి రెడ్డి. హెటిరో డ్రగ్స్‌. రూ.16 వేల కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 83వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 1,609వ స్థానం
  • కె. సతీశ్‌రెడ్డి. డాక్టర్‌ రెడ్డీస్‌. రూ.12,800 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 108వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,050వ స్థానం
  • జీవీ ప్రసాద్‌ అండ్‌ జి. అనురాధ. డాక్టర్‌ రెడ్డీస్‌. రూ.10,700 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 133వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,238వ స్థానం
  • పి. పిచ్చి రెడ్డి. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌. రూ.10,600 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 134వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,383వ స్థానం
  • రామేశ్వర్‌రావు జూపల్లి. మై హోం ఇండస్ట్రీస్‌. రూ.10,500 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 138వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,383వ స్థానం
  • పీ.వీ. కృష్ణారెడ్డి. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌. రూ.10,200 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 140వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా2,383వ స్థానం
  • ఎం. సత్యనారాయణ రెడ్డి. ఎంఎస్‌ఎన్‌ ల్యాబోరేటరీస్‌. రూ.9,800 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 143వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,530వ స్థానం
  • వీసీ నన్నపనేని. నాట్కో ఫార్మా. రూ.8,600 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లో 164వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 2,686వ స్థానంలో ఉన్నారు.
    ఈ 10 మంది హైదరాబాద్‌ బిలియనీర్లలో ఏడుగురు ఫార్మా రంగం నుంచి కాగా మిగిలిన ముగ్గురు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ కన్‌స్ట్రంక్షన్‌ రంగానికి చెందినవారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement