జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10.71 లక్షల దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు 7.50 లక్షల దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిపారు. మిగిలిన 3.21 లక్షల దరఖాస్తులను వారం రోజుల్లో పరిశీలిస్తామని హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
సర్వే పూర్తయిన తర్వాతే జీహెచ్ఎంసీలో వార్డు సమావేశాలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2,249 మంది దరఖాస్తులను పరిశీలించనున్నారని పేర్కొన్నారు. https://indirammaindlu.telangana.gov.in/applicantSearch వెబ్ సైట్ లో సర్వే సిబ్బంది వివరాలు ఉంటాయన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు వార్డు సమావేశాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు.