Saturday, November 23, 2024

1.8 మిలియన్‌ టన్నుల గోధుమల ఎగుమతి.. అఫ్ఘాన్​కు 33 వేల టన్నుల సహాయం

మన దేశం మే 13 నాటికి 1.8 మిలియన్‌ టన్నుల గోధుమలను 12 దేశాలకు ఎగుమతి చేసింది. వీటిలో బంగ్లాదేశ్‌, అఫ్ఘనిస్తాన్‌ వంటి దేశాలు ఉన్నాయి. మానవతా సాయం క్రింద అఫ్ఘనిస్తాన్‌కు 33 వేల టన్నుల గోధుమలను పంపించినట్లు ఫుడ్‌ సెక్రెటరీ సుధాన్షు పాండే తెలిపారు. అఫ్ఘనిస్తాన్‌కు మన దేశం 50 వేల టన్నుల గోధుమలను సాయం చేస్తామని హామీ ఇచ్చింది. జర్మనిలోని బెర్లిన్‌లో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న ఆయన ప్రపంచ ఆహార అవసరాలను భారత్‌ ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకుంటుందన్నారు. దేశ ప్రజల అవసరాలను తీరుస్తూనే, ప్రపంచ దేశాలకు అవసరమైనప్పుడు సాయం అందిస్తున్నామని చెప్పారు. గోధుమ ఎగుమతులను భారత్‌ నిషేధించినప్పటికీ, కొన్ని దేశాలు కొరత కారణంగా మార్కెట్‌ శక్తులకు వదిలేయకుండా, ఎగుమతులు చేస్తున్నట్లు వివరించారు. ఆయా దేశాల ప్రజల తిండి అవసరాల కోసం తాము గోధుమలను ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. పొరుగు దేశాల నిజమైన అవసరాలను గుర్తించిన భారత ప్రభుత్వం గోధుమలను ప్రభుత్వం ద్వారా ఆ దేశాల ప్రభుత్వాలకు వీటిని ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. గోధుమల ఎగుమతులపై ఈ సంవత్సరం జూన్‌ 22 వరకు నిషేధం ఉన్నప్పటికీ, అఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఇజ్రాయిల్‌, ఇండోనేషియా, మలేషియా, నేపాల్‌, ఒమన్‌, ఫిలిఫ్పైన్స్‌, ఖతార్‌, దక్షిణ కొరియా, శ్రీలంక, సూడాన్‌, స్విట్జర్లాండ్‌ , తైలాండ్‌, యూనైటెడ్‌ అరబ్‌ ఎమరేట్స్‌, వియత్నాం, యామిన్‌ వంటి దేశాలకు గోధుమలు పంపించినట్లు తెలిపారు. దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం మే 13న తక్షణం అమల్లోకి వచ్చేలా గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిందని ఆయన వివరించారు.

2020-21 సంవత్సరంలో భారత్‌ 7 మిలియన్‌ టన్నుల గోధుమలను ఎగుమతి చేసిందని, ఈ సారి కేవలం 2 మిలియన్‌ టన్నులు మాత్రమే ఎగుమతి చేసిందన్నారు. కరోనా కాలంలో వివిధ దేశాలకు భారత్‌ వాక్సిన్లను సరఫరా చేసిందని, ఇప్పుడు ఆకలితో ఇబ్బందులు పడుతున్న పలు దేశాల ప్రజల అవసరాల కోసం గోధుమలను పంపించిందని గుర్తు చేశారు. భూకంపంతో అల్లాడుతున్న అఫ్ఘనిస్తాన్‌కు ప్రధాన మంత్రి ఇచ్చిన హామీ మేరకు గోధుమలను పంపించామని వివరించారు. కరోనా కాలంలోనూ పలు దేశాలకు భారత్‌ గోధుమల రూపంలో ఆహార సాయం చేసిందన్నారు. ఇలా గోధుమలను డిజిబౌటీ, ఎరిట్రియా, లెబనాన్‌, మెడగాస్కర్‌, వాల్వీ, మాల్ధివులు, మయన్మార్‌, సియార్రా లియోన్‌, సూడాన్‌, సౌత్‌ సూడాన్‌, సిరియా, జాంబియా, జింబాబ్వే ఉన్నాయని తెలిపారు. భారత్‌ కరోనా సమయంలో చేసిన ఆహార సహాయం వల్ల 810 మిలియన్‌ ప్రజలకు ప్రయోజనం కలిగిందన్నారు. నేటికి కూడా భారత్‌ ఆహార సాయం అందిస్తూనే ఉందని, అమెరికా, యూరప్‌ దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది జనాభా దీని వల్ల ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. సరఫరాలన్నీ పక్కాగా బయోమెట్రిక్‌ విధానంలో నిజమైన భాదితులకే సాయం అందేలా చూస్తున్నామని వివరించారు.

ప్రపంచ ఆహార భద్రతకు భారత్‌ తన వంతు సాయం చేస్తుందని పుడ్‌ సెక్రెటరీ..

వివరించారు.

ప్రస్తుతం ప్రపంచం ఆహార, ఎరువుల, చమురు ధరల పెరుగుదలతో అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు సమాన అవకాశాలు రావాల్సి ఉంటుందన్నారు.ఇటీవల కాలంలో తలెత్తిన సప్లయ్‌ సమస్యలను అధిగమించాల్సి ఉందన్నారు. వాతావరణ మార్పుల మూలంగా ఏర్పడే అడ్డంకులు, కరోనా లాంటివి తలెత్తిన సమయంలో ఏర్పడే అడ్డంకులను అధిగమించి ఆహార సరఫరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాల్సిన అవసరాన్ని నెక్కి చెబుతున్నాయని చెప్పారు. భారత్‌లో వ్యవసాయాన్ని మరింత ఫలవంతంగా చేసేందుకు భూమి, నీటిని సరైన ధృక్పదంతో నిర్వహిస్తున్నామని వివరించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement