సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న అతిపెద్ద గ్రహశకలం భూమికి అత్యంత చేరువుగా రానుంది. ఈనెల చివరివారంలో ఈ పరిణామం సంభవించ నుంది. 1.8 కి.మి విస్తీర్ణంలో ఉండే ఆ గ్రహశకలం భూమికి 40 లక్షల 24వేల 182 కి.మి. సమీపానికి రానుంది. గంటకు 47,196 వేగంతో దూసుకొచ్చే ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం మాత్రం లేదు. అతిప్రమాదకరమైన ఈ గ్రహశకలాన్ని 1989లో నాసాకు చెందిన పలోమార్ అబ్జర్వేటరీ గుర్తించింది. ఈ గ్రహశకలానికి 1989జేఏగా పేరుపెట్టారు. భూమికి చేరువుగా వచ్చినపుడు దీనిని బైనాక్యులర్ సాయంతో వీక్షించొచ్చు. 1996లో ఒకసారి ఈ గ్రహశకలం భూమి సమీపానికి వచ్చి వెళ్లింది.అప్పుడు 40 లక్షల .కి.మి సమీపంలోను దూసుకుపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..