Saturday, November 23, 2024

మూడు కంపెనీల ఎం క్యాప్‌లో రూ.1.78 లక్షల కోట్లు వృద్ధి..

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లో గడిచిన వారం టాప్‌ 4లోని మూడు కంపెనీల క్యాపిటలైజేషన్‌ రూ.1.78 లక్షల కోట్లు పెరిగింది. ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ భారీగా పెరిగింది. బెంచ్‌ మార్క్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గత వారం 1532.77 పాయింట్లు (2.30 శాతం) లాభపడి 54,326 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం నాటి సెషన్‌లో భారీగా నష్టపోయినప్పటికీ.. శుక్రవారం అంతకుమించి 1,534 పాయింట్లు (2.91 శాతం) లాభపడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనీలీవర్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ పెరిగింది. టాప్‌ 5లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌ తగ్గింది. రిల్‌ ఇండస్ట్రీస్‌ ఎం క్యాప్‌ రూ.1,31,320.80 కోట్లు పెరిగి.. రూ.17,73,889 కోట్లకు, హిందుస్తాన్‌ యూనీలీవర్‌ ఎం క్యాప్‌ రూ.30,814 కోట్లు పెరిగి.. రూ.5,46,397.45 కోట్లకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎం క్యాప్‌ రూ.16,515 కోట్లు పెరిగి.. రూ.7,33,156 కోట్లకు పెరిగింది.

టీసీఎస్‌లో క్షీణత..

అదే సమయంలో టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.43,743 కోట్లు తగ్గి.. రూ.12,05,254 కోట్లకు, ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.20,129 కోట్లు తగ్గి.. రూ.6,12,303 కోట్లకు క్షీణించింది. మంగళవారం ఎల్‌ఐసీ 8 శాతం నష్టంతో లిస్ట్ అయ్యింది. దీంతో ఈ కంపెనీ ఎం క్యాప్‌ రూ.5,22,602 కోట్లుగా నమోదైంది. ఆ తరువాత ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.4,93,251 కోట్లు, ఎస్‌బీఐ ఎం క్యాప్‌ రూ.4,12,763 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ క్యాప్‌ రూ.3,99,512 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.3,77,686 కోట్లకు చేరుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement