Tuesday, November 26, 2024

టాప్‌ 9 కంపెనీలకు 1.22 లక్షల కోట్లు నష్టం.. మార్కెట్ల భారీ నష్టాల ఫలితం

గత వారం స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. దీని వల్ల టాప్‌ 10 కంపెనీల్లో 9 కంపెనీలకు కలిపి 1,22,092.9 కోట్ల మేర మార్కెట్‌ సంపదను కోల్పోయాయి. వీటిలో అన్నింటికంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎక్కువ సంపదను కోల్పోయింది.
గత వారం బీఎస్‌ఈ 30 బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌ 843.86 పాయింట్లు నష్టపోయింది. ఫలితంగా టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌ మార్కెట్‌ సంపదను కోల్పోయాయి. ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సంపద మాత్రం పెరిగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత వారం 29,767.66 కోట్ల సంపదను కోల్పోవడంతో కంపెనీ మార్కెట్‌ విలువ 17,35,405.81 కోట్లుకు తగ్గింది.

టీసీఎస్‌ 19,960.12 కోట్ల సంపదను కోల్పోయి, 11,84,837.43 కోట్లకు మార్కెట్‌ సంపద చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ 19,722.3 కోట్లు కోల్పోవడంతో, 6,29,380.54 కోట్లుగా మార్కెట్‌ సంపద ఉంది. ఇన్ఫోసిస్‌ కంపెనీ 19,567.57 కోట్ల నష్టంతో 6,40,617.19 కోట్ల మార్కెట్‌ సంపదకు తగ్గింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ కంపెనీ 11,935.92 కోట్లు సంపదను కోల్పోయి 6,27,434.85 కోట్లకు మార్కెట్‌ సంపద తగ్గింది. ఎస్‌బీఐ 11,735.86 కోట్ల సందను కోల్పోవడంతో 5,38,421.83 కోట్లుగా మార్కెట్‌ విలువ ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ 7,204.38 కోట్ల సంపదను కోల్పోవడంతో, 4,57,325.46 కోట్లుగా మార్కెట్‌ విలువ ఉంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1,903.8 కోట్ల సంపదను కోల్పోవడంతో 4,53,617.85 కోట్లుగా మార్కెట్‌ విలువ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ 295.29 కోట్ల సంపదను కోల్పోయింది. దీంతో దీని మార్కెట్‌ విలువ 4,86,460.48 కోట్లుగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 4,126.18 కోట్ల సంపదను పెంచుకోవడంతో దీని మార్కెట్‌ విలువ 9,13,726.29 కోట్లకు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement