స్మగ్లర్స్ కొత్త కొత్త దారులని వెతుకుతున్నారు. పోలీసులకి చిక్కకుండా రోజుకో ఐడియాలని అమలు చేస్తున్నారు. కాగా సబ్బుపెట్టెల్లో హెరాయిన్ ని తరలిస్తుండగా పోలీసులకి చిక్కారు. ఈ సంఘటన మిజోరాం లాంగ్లీ జిల్లాలోని సతీక్ సమీపంలో చోటు చేసుకుంది. కాగా హెరాయిన్ తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 222 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.1.11 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం 17 సోప్ బాక్సులను సీజ్ చేసినట్టు తెలిపారు. మిజోరాంలో జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జమ్మూలోని రెండు వేర్వేరు ఘటనలో 42 కేజీల గసగసాలు, 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ నుంచి వాహనంలో వస్తున్న ఇద్దరు అనుమానిత వ్యక్తులను జమ్మూ నగర శివార్లలోని ఝజ్జర్ కోట్లి వద్ద ఆపి సోదాలు నిర్వహించగా… వారి నుంచి 42 కిలోల గసగసాలు ఉన్న నాలుగు సంచులు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం పోలీసు అధికారులు సమాచారం అందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement