దేశీయ విమాన సంస్థల్లో ఆగస్టు నెలలో 1.01 కోట్ల మంది ప్రయాణీంచారు. జులైలో ఈ సంఖ్య 97.05 లక్షలు. ఆగస్టులో 4 శాతం మంది పెరిగారని డీజీసీఏ తెలిపింది. ఈ సంవత్సరం జనవరి-ఆగస్టు నెలల మధ్యలో మొత్తం 770.70 లక్షల మంది దేశీయ విమానయాన సంస్థల్లో ప్రయాణీంచారు. 2021లో ఇదే కాలంలో ప్రయాణీకుల సంఖ్య 460.45 లక్షలు. 2022లో ప్రయాణీకుల వృద్ధి 67.38 శాతం నమోదైంది.
దేశంలోని ఢిల్లి, బెంగళూర్, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల్లో చూస్తే విమానాల సమయ పాలనలో ఎయిరేషియా 93.3 శాతం, విస్తారా 91.4 శాతం, ఎయిర్ ఇండియా 87.9 శాతం, ఇండిగో 85.5 శాతం, స్పైస్‌జెట్ 79.1 శాతం, గోఫస్ట్ 74.9 శాతం, అలయన్స్ ఎయిర్ 72.1 శాతం సాధించాయి. సీట్ల భర్తీ విషయంలో స్పైస్‌జెట్ 84.6 శాతం, విస్తారా 84.4 శాతం, ఇండిగో 78.3 శాతం, గోఫస్ట్ 81.6 శాతం, ఎయిరిండియా 73.6 శాతం, ఎయిరేషియా 74.9 శాతం, అలయన్స్ ఎయిర్ 65.5 శాతంగా ఉంది.