పోరుగు రాష్ట్రాల్లో మరోమారు కరోనా విజృంభించడం తెలంగాణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్ తదితర ప్రాంతాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్న తీరుతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంటే సరిహద్దుల్లో అప్రమత్తం చేయకుండా సర్కార్ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని సరిహద్దు జిల్లాల ప్రజలు విమర్శిస్తున్నారు. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో కూడా ఇది నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరించిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాలూ తెలంగాణ సరిహద్దులకు ఆనుకుని ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేవారిని ఆపి పరీక్షలు చేయడం లాంటి చర్యలు ప్రభుత్వం ఇంత వరకూ చేపట్టకపోవడాన్ని సరిహద్దు జిల్లాల ప్రజలు ఎత్తి చూపుతున్నారు.
హైదరాబాద్ : పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు – తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఆందోన
Advertisement
తాజా వార్తలు
Advertisement