హైదరాబాద్ -రంగారెడ్డి -మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, ప్రముఖ విద్యావేత్త సురభి వాణీదేవిని ఎంపిక చేయడంలో టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ అపర చాణక్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు చెక్ పెట్టే క్రమంలో ఇది తొలి అడుగుగా చెప్పవచ్చు. ఓడిపోయే సీటును పీవీ కుమార్తెకు ఇచ్చి..దివంగత ప్రధాని పీవీ కుటుంబాన్ని ఇబ్బందికర పరిస్థుతుల్లోకి నెట్టారని కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోవలసిన పని లేదు. ఎందుకంటే పీవీ కుమార్తెను బరిలోకి దింపడం ద్వారా కేసీఆర్ ఒకే సారి కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చారు. బిజెపి నుంచి గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పట్టభద్ర ఎమ్మెల్సీగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి డాక్టర్ చిన్నారెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా రంగంలో ఉన్నారు. వీరిని ఎదుర్కోవడం కోసం కెసిఆర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రామచంద్రరావును ఎదుర్కొనేందుకు బ్రాహ్మణ వర్గానికి చెందిన, విద్యావంతురాలయని వాణీదేవిని ఎంపిక చేయడం చాలా కీలక నిర్ఱయంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పీవీ కుటుంబానికి ఇచ్చిన ఈ ఆత్మీయ, అపురూప గౌరవం ఆ మహనీయుడి శతజయంతి వేళ ఆయనకు అందించే నివాళిగా పీవీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రుల ఎంఎల్‌సి నామినేషన్ల గడువు ఈ రోజుతో ముగియనుండగా, ఆదివారం సాయంత్రం టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ స్థానానికి పీవీ కుమార్తె వాణిదేవిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇచ్చారు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు జరుపు కుంటున్న వేళ ఆయన కుటుంబానికి కెసిఆర్ ఆత్మీయ కానుక ఇచ్చినట్లైంది. పీవీ కుమార్తెగా, విద్యావేత్త, చిత్రకారిణిగా గుర్తింపుపొందిన సురభి వాణీదేవిని ఎమ్మెల్సీ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ విజయావకాశాలు పెరిగాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీవీకి ఉన్న జనాదరణ పట్టభద్ర ఎన్నికల్లో బాగా కలసి రానుందని అంటున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీకి కాంగ్రెస్ చేసిన అవమానాలు, అన్యాయాన్ని ఎన్నికల్లో ఎత్తి చూపేందుకు అవకాశం టీఆర్ ఎస్ కు అవకాశం వాణీదేవి విద్యాభ్యాసం, వృత్తి జీవితం మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే సాగింది. 1986లో జేఎన్టీయూ నుంచి డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్‌లో పట్టాపొందారు. విద్యావేత్తగా, చిత్రకారిణిగా, సంఘ సేవకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉన్నది. 35 ఏండ్లుగా వందల పెయింటింగ్స్ వేసిన వాణీదేవి.. తన పెయింటింగ్స్‌తో ఇప్పటివరకు 15 ఎగ్జిబిషన్లు నిర్వహించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్-డీసీలో ఉన్న గాంధీ మెవెూరియల్ సెంటర్‌లో ‘సారే జహాసె అచ్ఛా’ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించి రికార్డు సృష్టించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement