కేసీఆర్ థింకర్, లీడర్,రాజకీయ వేత్త. ఆయన నుంచిచాలా నేర్చుకున్నా. కేసీఆర్ గారు మంచి ఫాదర్. ఆయన తిట్టినా కూడా గంట తర్వాత మనకు దాని వెనుక ఉన్న మంచి విషయం అర్థమవుతంది. ఆయనకు కోవం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. పిల్లలను ఎలా పెంచాలో కూడా ఆయన నుంచి నేర్చుకోవాలి.
నాన్న కేసీఆర్ ఉక్కుమనిషి. ఆయన సంకల్ప బలం గొప్పది. ఏదైనా చేయాలనుకుంటే చేసి తీరతారు. ఎన్ని అడ్డంకులున్నా ఆ పనిని పూర్తి చేసి తీరతారు. చిన్నచిన్న పనులపైన ఆయన పెట్టే శ్రద్ధ చూస్తే ఆశ్చర్యపోవా ల్సిందే. మనిషి. నేను 3వ క్లాసులో ఉన్నప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే. ఒక పని చేస్తే ఒకరు మెచ్చుకుంటే ఇద్దరు తిడతారని ఆయన చెప్పేవారు. అలాగని మనం చేసేపని ఆపకూడదు ధైర్యంగా చేయాలనేవారు. ఈ కారణాల వల్లే నేను చదువు, రాజకీయాల్లో రాణించ గలిగాను. నాన్న కేసీఆర్ థింకర్, లీడర్, రాజకీయ వేత్త. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అప్పట్లో మేము న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండే వాళ్లం. అన్నయ్య హాస్టల్లో చదివినప్పటకీ నేను ఇంట్లో అమ్మానాన్న లతోనే ఉండి చదువుకున్నాను. కేసీఆర్ గారు మంచి ఫాదర్. ఆయన తిట్టినా కూడా గంట తర్వాత మనకు దాని వెనుక ఉన్న మంచి విషయం అర్థమవుతంది. ఆయనకు కోవం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. నాన్న ఒకసారి ఒక లెటర్ రాయమంటే రాశాను. దానిలో కరెక్షన్స్ చేసి సుమారు 200సార్లు తిరిగి రాయించారు. అలా మనం ఏదైనా తప్పు చేస్తే చెబుతారు తప్ప తిట్టరు… కొట్టరు. ఆయన ఎవరి మీద కనీసం స్వరం పెంచి అరవరు. పిల్లలను ఎలా పెంచాలో కూడా ఆయన నుంచి నేర్చుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను ఎంతో మంది తిట్టినపుడు బాధపడ్డాము. కానీ ఉద్యమ అవసరాల దృష్ట్యా ఆయన పరుషంగా మాట్లాడినం దుకే ఆ విమర్శలని అర్థం చేసుకున్నాం. తెలంగాణ ఉద్యమం కోసం అన్నీ భరించాం. విమర్శిస్తారను కుంటే జీవితం ముందుకు సాగించలేమన్నది ఆయన ఫిలాసఫీ.
2009లో ఉద్యమం తారాస్థాయికి చేరుకున్న సమయంలో నాన్న ఆమరణ నిరాహార దీక్ష చేసినపుడు మేం పడ్డ కష్టం గుర్తు తెచ్చుకున్నపుడు భయం వేస్తుంది. మాటల్లో చెప్పలేని బాధ ఆ 11 రోజుల్లో అనుభవించాం. నాన్న దీక్ష తర్వాత కొంత కాలానికి తెలంగాణ కల సాకారమైన తర్వాత ఎన్నికల్లో పార్టీ గెలిచింది. అప్పటి నుంచి కేసీఆర్‌లో ఒక మంచి పరిపాలన దక్షున్ని చూశాం’.