Friday, November 22, 2024

హైదరాబాద్: టీఆర్ఎస్,ఎంఐఎం బంధం బహిర్గతమైంది : బండి

తెలంగాణ రాష్ట్రసమితి, ఎంఐఎం మధ్య సంబంధం  మరోసారి బహిర్గతమైందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ రోజొక ప్రకటనలో ఆయన  ఈ విషయాన్ని తాము జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా చెప్పామని అదే ఇప్పుడు నిజమైందని పేర్కొన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రెండూ చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయనీ, బయటకు మాత్రం రెండూ వేర్వేరుగా వ్యవహరిస్తున్నాయనీ పేర్కొన్నారు. ఆ రెంటి మధ్య చీకటి ఒప్పందాలే కనుక లేకుంటే, కలిసి పోటీ చేయకుంటే టీఆర్ఎస్ కు సింగిల్ డిజిట్ సీట్లు కూడా వచ్చేవి కావని బండి సంజయ్ పేర్కొన్నారు.  మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పక్కా మతతత్వ పార్టీ అనీ, ఎంఐఎంకు చెంచా అని నిర్ద్వంద్వంగా వెల్లడైందని బండి సంజయ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ రెండు పార్టీలూ కలిసి హైదరాబాద్ ను దోచుకునే కుట్ర చేస్తున్నాయన్న ఆయన, బీజేపీ కార్పొరేటర్లు కంటికి రెప్పలా హైదరాబాద్ ను కాపాడుకుంటారని భరోసా ఇచ్చారు.  పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసిన ఈ రెండు పార్టీలను బజారుకు లాగుతామని హెచ్చరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement