Friday, November 22, 2024

హైదరాబాద్ : కేసీఆర్ …ఓ కర్మయోగి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధకుడు ,ముఖ్యమంత్రి,తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు 66వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కోటి మొక్కలను నాటాలన్న ఆలోచన చాలా గొప్పది. ఆయనకు సమర్పించే కానుక.కేసీఆర్‌గా ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే చంద్రశేఖరరావు ప్రజల హదయాల్లో మంచి నడ వడిక, ఉత్తమ ప్రజా జీవనం మొదలైన అంశాలపై బీజాలు వేశారు.అవి ప్రజల మెరుగైన జీవన విధానానికి ఎంతో తోడ్పడ్డాయి.

పెద్దన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు – జే సంతోష్‌ కుమార్‌

తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ మత్యు ముంగిట్లోకి వెళ్లివచ్చారు. ఆయన ఆమరణ దీక్షకు దిగి 11 రోజులపాటు నిరాహారంగా ఉన్నారు. దీక్షా సమయంలో జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఆయనను వెన్నంటి ఉన్నారు. ఆ సమయంలో కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణించడం, నాటి సీఎం రోశయ్య హామీ ఇచ్చినా దీక్ష విరమణకు నిరాకరించడం, చివరకు కేంద్రం దిగివచ్చి… తెలంగాణ ప్రకటన చేయడం.. కేసీఆర్‌ దీక్ష విరమించడం వరకు జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఆ వివరాలు… సంతోష్‌ కుమార్‌ మాటల్లోనే…

ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి జన్మ దినోత్స వం.ఈ రోజుఉదయం పది గంటలకు ఆయనకు ఎన్నడూ మరిచిపోలేని బహుమానాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యాం. కోటిమొక్కలను నాటడం ద్వారా ఆయనకు అపూర్వమైన బహుమానాన్ని ఇచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేశాం.ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ నే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలనుపచ్చటి ఆచ్చాదనతో నింపనున్నాం.
కోటి మొక్కలు ఎందుకు ?అనే సందేహం చాలా మందికి రావచ్చు.ఆ సంఖ్యకు ఎంతోప్రాముఖ్యం ఉంది. కేసీఆర్‌ గారితో 2000సంవత్సరం నుంచి చాలా సన్నిహితంగా మెలుగుతున్నాను.ఆయనతో తిరగడంవల్ల నాలో ఆలో చన బయలుదేరింది.ఏదైనా చేయాలనే తపన నాలో బయలు దేరింది.కేసీఆర్‌ గారితో సన్నిహితంగా మెలగడం నా పూర్వజన్మ పుణ్య ఫలం. కోటి జన్మల పుణ్యం. ఆయన పేరిట నేను కోటి మొక్కలను నాటినా అవి తక్కు వే. నేను మొక్కల నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. మీకు వింత గా తోచవచ్చు కానీ, కేసీఆర్‌తో కలిసి నడవడంలో నేను నేర్చుకున్న పాఠాలు ఇన్నీఅన్నీ కావు. మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర సమితిలో అంకితమైన సభ్యునిగా, రాజ్యసభ ఎంపీ గా, పార్టీ సభ్యులకు సన్నిహిత మిత్రునిగా మాత్రమే తెలుసు. కేసీఆర్‌ సాన్నిహి త్యం లేకపోతే నేను 14 సంవత్సరాలు మించి ఎదిగి ఉండేవాడినికాను.
పునర్జన్మ: నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు నేను మా నాన్నగారి సోదరుని కుటుంబంతో కలిసి ఉండేవాడిని.ఒక రోజున నాకు తీవ్రమైన జ్వరంతో పాటు భరించరాని కడుపునొప్పి వచ్చింది.మా అన్న కెటీఆర్‌ గారు మా ఇంటికి వచ్చారు.ఆయన ఇది అపెండిసిటీస్‌ కావచ్చని అన్నారు.నన్ను ఆయన మా తల్లితండ్రులకు తెలియజేశారు.నన్ను కేసీఆర్‌ ఇంటికి తీసుకుని వెళ్ళారు.అక్కడ మా పెద్ద మ్మ గారు నన్ను సముదాయించారు.తర్వాత నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. నాకు అపెండిసైటిస్‌ వచ్చినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.ఆ మరునాడు మధ్యాహ్నం ఆపరేషన్‌ చేస్తామన్నారు.సరిగ్గా అదే రోజున హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం.ఆ మరునాడు కేసీఆర్‌ నన్ను చూడటానికి వచ్చారు.అప్పటికే నేను కడుపునొప్పితో గిలగిలా కొట్టుకుంటున్నాను.ఆయన నన్ను చూసి వేదన పడ్డారు. ఆ రోజు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండటం వల్ల ఆపరేషన్‌ మధ్యాహ్నానికి బదులు ఉదయం జరిపేట్టు కేసీఆర్‌ గారు డాక్టర్లను కలిసి ఒప్పించారు,నాకు ఆపరేషన్‌ రెండు గంటల సేపు జరిగింది.ఇది చాలా క్లిష్టమైనదనీ,ఆలస్యంచేసి ఉంటే ప్రాణం మీదికి వచ్చి ఉండేద నీ,కేసీఆర్‌ ఆపరేషన్‌ టైమింగ్‌ను మార్పించడం వల్ల ప్రాణం దక్కిందని ఆ తర్వాత నాకు తెలిసింది.ఆపరేషన్‌ అయిన నెలరోజులకు కోలుకున్నాను.కేసీఆర్‌ గారి వల్ల నా ప్రాణం నిలబడింది..నిజంగా ఇది పునర్జన్మే.నా జీవితంలో ఇది మరిచిపోలేని ఘటన.
మానవత్వం…సంరక్షణ: 2004లో కేసీఆర్‌ కేంద్ర కార్మిక మంత్రిగాఉన్న సమయంలో కొత్త ఢిల్లిలో వేదికమీద నుంచి పడిపోయారు. ఆయన తుంటికి శస్త్రచికిత్స జరిగింది.ఆయన నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన పక్కన ఉండి సేవలందించాను.ఆ సమయంలో ఆయన అనుభవాలను తెలుసుకున్నాను.
పుస్తకాల్లోంచి ఎన్నో కొటేషన్లు అవి అనర్గళంగా చెప్పేవారు.నాలో అవి చాలా చక్కని అనుభూతిని ఇచ్చాయి.అయితే,తన కోసం నేను ఎంతో శ్రమపడటాన్ని చూసి ఆయన నొచ్చుకున్నారు. నేను మీ నుంచి అనేక విషయాలను నేర్చుకుంటున్నాను,ఇది మంచి అవకాశం అని అన్నాను.దాంతో మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది.
నిరవధిక నిరాహార దీక్ష
కేసీఆర్‌ తెలంగాణ కోసం నిరవ ధిక నిరాహార దీక్ష చేసిన సంగతి అందరికీ తెలి సిందే. ఆయన వజ్ర సం కల్పుడు.ఆయన ప్రాణాలకు తెగించి దీక్ష చేశారు. నవంబర్‌ 29వ తేదీన దీక్షా దివస్‌ ను జరుపుకుంటున్నాం. 2009 నవం బర్‌ 29వ తేదీ నుంచి డిసెంబ ర్‌ 9వ తేదీ వరకూ ఆయన నిరాహార దీక్ష చేశారు.నవంబర్‌ 29వ తేదీన కేసీఆ ర్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారు,కెప్టెన్‌ వి లక్ష్మీకాం తరావు,,ఆర్‌ విద్యా సాగరరావు,రాజయ్య యాదవ్‌ ,నాయని నరసింహారెడ్డి లు కరీం నగర్‌ లో కేసీఆర్‌ నివాసంలొ ఉన్నారు. వారందరి సమక్షంలోనే నిరవధిక నిరాహార దీక్ష జరపాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. కరీంనగర్‌ వెళ్తుండగా పోలీసులు ఆయన వాహన శ్ర్రేణిని అడ్డుకున్నారు. ఆయనను ఖమ్మం జైలుకు తీసుకుని వెళ్ళారు.కవిత భర్త అనిల్‌ కుమార్‌,నేను మరికొందరం ఆయన వెంట ఉన్నాం. కేసీఆర్‌ ప్రభృతులను జైలు లోపలకుతీసుకుని వెళ్ళగా, మేము కారులోనే నిద్రించాం. రెండవ రోజున కేసీఆర్‌ రక్తపోటు లో తేడా వచ్చినట్టు, బ్లడ్‌ సుగర్స్‌ బాగా తగ్గినట్టు డాక్టర్లు గుర్తించారు.ఖమ్మం ఆస్పత్రికి తీసుకుని వెళ్ళగా,ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐవి ఫుడ్స్‌ తీసుకోవాలనివైద్యులు సూచించగా ఆయన నిరాకరించారు.మీరు బాగుంటేనే తెలంగాణాను సాధించగలమని చాలా మంది చెప్పిచూశారు. ఆయన వినలేదు.ఆనాటి ముఖ్యమంత్రి కె రోశయ్య ఆస్పత్రికి వచ్చి కేసీఆర్‌ ని పరామర్శించారు. ఢిల్లిd పెద్దలతోమాట్లాడతాననీ , వారిని ఒప్పిస్తానని హామీ ఇచ్చారు.అయినా కేసీఆర్‌ తన పట్టు వీడలేదు.
8వ రోజున కేసీఆర్‌ ఆరోగ్యంమరింత క్షీణించింది. చలి,వణుకు బయలుదేరింది. ఐదు నిమిషాలసేపు వణికి పోయారు.ఆ సమయంలో కేటీఆర్‌ అన్న,కవిత ఆయనకు దుప్పట్లు కప్పారు.అయినా ఆయన చలి తగ్గలేదు.ఇరవై నాలుగు గంటల్లో ఆయన కనీసం 12సార్లుఈ విధంగా బాధపడ్డారు.మేమంతా ఎంత బతిమలాడినా ఆయన వినలేదు. చివరగా, 11వ రోజున అంటే 2009 డిసెంబర్‌ 9వ తేదీన చీఫ్‌ ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌ కేసీఅర్‌ వద్దకు వచ్చి ఆయన ఆరోగ్యం క్షీణించడాన్ని గుర్తించి ఢిల్లిd పెద్దలకు తెలియజేశారుఆరోజున ఆయన శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి పరిస్థితుల్లోనూ తెలంగాణపై కేంద్రం ప్రకటన చేయనిదే దీక్ష విరమించనని ఆయన పట్టుపట్టారు. చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వ డానికి కేంద్రం ఒప్పుకున్న తర్వాత కేసీఆర్‌ నిరాహార దీక్ష విరమించారు.
ఈ రోజు మనం అంతా ప్రత్యేక రాష్ట్రాన్ని అనుభవిస్తున్నామంటే అది కేసీఆర్‌ చలువే. ఆయన 67వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం ప్రజాసేవ చేయాలని భగవంతుని ప్రార్ధిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement