తెలంగాణ మణిహారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. మేఘా భూగర్భ ఇంజనీరింగ్ నిర్మించిన గాయత్రి పంపింగ్ కేంద్రం మరో రికార్డు నెలకొల్పింది. అనతికాలంలోనే గాయత్రి పంప్‌హౌస్ నుంచి 100 టీఎంసీల నీరు ఎత్తిపోశారు. ఆ పంప్‌హౌస్ ద్వారా ప్రాణహిత నీటిని శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు తరలిస్తారు. 2019, ఆగస్టు 8న గాయత్రి పంప్ హౌస్‌ను మేఘా ప్రారంభించగా, అత్యధికంగా 1703 గంటలు నీటిని రెండవ మిషన్ పంపింగ్ చేయగా మొదటి మిషన్ నుంచి 1367 గం.పాటు ఎత్తిపోసింది. ఒక్కొక్క పంప్‌హౌస్ నుంచి 3150 క్యూసెక్కులతో 100 టీఎంసీల నీటిని పంప్ చెెశారు. కాళేశ్వరం పథకంలో లింక్-2లో భాగంగా గాయత్రి పంప్‌హౌస్ నిర్మాణం జరగ్గా, ఒక్కొక్కటి 139 మెగావాట్లతో మొత్తం ఏడు మిషన్లు ఏర్పాటు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement