Friday, November 22, 2024

హైదరాబాద్ : కట్టడిలో తెలంగాణ ఫార్ బెటర్ : ఈటల

రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం అనుసరించిన విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో కరోనా కట్టడి చర్యలు మెరుగ్గా ఉన్నాయని పేర్క్కొన్నారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాలు సెకండ్‌ వేవ్‌ తో బాధ పడుతున్నాయని.. కానీ కరోనాను మనం కట్టడి చేయగలిగామని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గాంధీలో వ్యాక్సిన్‌ ఈ రోజు వ్యాక్సిన్ తీసుకున్నారు.  ఆ సందర్భంగా  మంత్రి ఈటలగాంధీ ఆసుపత్రికి వచ్చారు. ఆసందర్భంగా ఆయన మాట్లాడుతూ , కరోకా కట్టడి కోసం గాంధీ  హాస్పిటల్‌లో అన్ని రకాల సిబ్బంది ఆత్మవిశ్వాసంతో పని చేశారన్నారు.
35వేలకుపైగా కొవిడ్‌ పేషెంట్స్‌ గాంధీలో చికిత్స పొందారని, 7వేల మందికిపైగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న వారికి ఇక్కడ  చికిత్స అందజేశామని చెప్పారు. అందరికి వ్యాక్సిన్‌ ఇచ్చే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని, త్వరలోనే వందల సంఖ్యలో వ్యాక్సిన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రాణాలకు తెగించి వైద్యులు కర్తవ్యం నిర్వహిం చారని.. వారి సేవలను గుర్తించి సన్మానం కూడా చేస్తున్నామని తెలిపారు.అందరికి వ్యాక్సిన్‌ ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement