గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్, మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల గడువు నేడు ముగిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు రేపు పరిశీలించనున్నరు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ జరగనుంది. మార్చి 17న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. కాగా, ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాలలో పోటీ చేసేందుకు కోదండరాం, బిజెపి అభ్యర్ధి ప్రేమేందర్ , కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్, టిఆర్ ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డిలు తమ నామినేషన్లు దాఖలు చేశారు.. ఇక మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల స్థానానికి కాంగ్రెస్ అభ్యర్ధిగా చిన్నారెడ్డి, టిఆర్ ఎస్ అభ్యర్ధిగా వాణీదేవి, బి జె పి అభ్యర్ధిగా రామచందరరావు, స్వతంత్ర అభ్యర్ధిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ లు నామినేషన్ లు వేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement