బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు సమన్లు పంపారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. హృతిక్..కంగనరనౌత్ ల మధ్య వివాదం తెలిసిందే. అప్పట్లో ప్రేమలో మునిగి తేలిన ఈ జంట బ్రేకప్ తర్వాత పరస్పరం నోటీసులు పంపుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 2016లో కంగన రనౌత్‌పై సైబర్ పోలీసులకు హృతిక్ రోషన్ ఫిర్యాదు చేశారు. నకిలీ మెయిల్ ఖాతా నుంచి తనకు మెసేజ్‌లు, మెయిల్స్ వస్తున్నట్లు చెప్పారు. ఈ కేసును రెండు నెలల క్రితం క్రైమ్ బ్రాంచ్‌కు సైబర్ పోలీసులు బదిలీ చేశారు.దీంతో దీనిపై విచారణ జరుపుతోన్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హీరో హృతిక్ రోషన్‌కు సమన్లు పంపి, విచారణకు రావాలని ఆదేశించారు. కంగనా రనౌత్ ఈ-మెయిల్ కేసులో భాగంగా రేపు విచారణకు వచ్చి, పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించారు. ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హృతిక్ వాంగ్మూలం నమోదు చేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement