Friday, November 22, 2024

సొంత పార్టీపైనే సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు

కేరళలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సారి కేరళ రాష్ట్రంలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న కేరళలో బీజేపీ అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది అందుకు తగ్గట్లుగానే ప్రజల్లో మంచి పేరున్న శ్రీధరన్ ను తమ పార్టీ సీఎం అభ్యర్థి గా ప్రకటించింది. దేశంలో అనేక మెట్రో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి మెట్రో మ్యాన్ గా పేరొందారు శ్రీధరన్​. బీజేపీ అధికారం చేపడితే రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసి, అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కాని సీఎం అభ్యర్థిని ప్రకటించి రెండు రోజులైనా కాకముందే సొంతపార్టీ పైన విమర్శలు చేశారు సుబ్రమణ్య స్వామి. 89 ఏళ్ల మెట్రో శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు. పార్టీ రూల్స్ ప్రకారం 75 ఏళ్ళు దాటిన వారికి పదవులు ఇవ్వరు. అలా అయితే 2024లో అద్వానీ, మురళీ మనోహర్, శాంతకుమార్ లు పోటీ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.

అయితే సొంత పార్టీలోనే సీఎం ఎంపికపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో తో కేరళ బీజేపీ నాయకులు లు సందిగ్ధంలో పడిపోయారు. అంతేకాదు కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తికి సీఎం అభ్యర్థి టికెట్ ఇవ్వడం నచ్చని కొందరు పార్టీ నాయకులకు సుబ్రహ్మణ్యం స్వామి కామెంట్స్ తో హైకమాండ్ వద్ద తన అసంతృప్తిని వ్యక్త పరిచినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement